AP: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగుదేశం పార్టీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న నాయకుడిగా గుర్తింపు పొందిన వర్మకు గత కొంతకాలంగా సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడటంతో వర్మ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మ పోటీ చేయాల్సి ఉండేది.
ఇలా వర్మకు టికెట్ వస్తుందని భావించి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు కానీ ఆఖరి నిమిషంలో పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికలలో నిలబడటంతో ఒక్కసారిగా తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ మొత్తం కాల్చి వేస్తూ బాబుపై విమర్శలు కురిపించారు.
ఇలాంటి తరుణంలోని చంద్రబాబు నాయుడు వర్మ కు ఫోన్ చేసి టికెట్ రాలేదని బాధపడద్దని తర్వాత ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చారట అయితే ఇటీవల వరుసగా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న కానీ వర్మకు మాత్రం అవకాశం ఇవ్వలేదు చివరికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీలలో అయిన తనకు అవకాశం ఉంటుందని నిన్నటి వరకు ఎదురు చూశారు కానీ అప్పుడు కూడా వర్మ పేర్లు లేకపోవడంతో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయారని తెలుస్తుంది.
ఇక వర్మకు బాబు ఇలా ఎమ్మెల్సీ ఇవ్వకపోవడానికి కారణం లేకపోలేదు ఇప్పటికే పిఠాపురంలో జనసేన వర్సెస్ టిడిపి అనే విధంగా వివాదాలు కొనసాగుతున్నాయి. వీటిని సద్దుమణిగించడంలో వర్మ విఫలమయ్యారని చెప్పాలి అదే విధంగా వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి తనని క్యాబినెట్ లోకి తీసుకుంటే ఓకే నియోజకవర్గంలోనే రెండు పార్టీల మధ్య ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతోనే వర్మకు బాబు అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది.
ఇక వర్మకు టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరులు అధినేత చంద్రబాబు తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వర్మ కూడా చంద్రబాబుపై తిరుగుబాటుకు సిద్ధమవుతారని తెలుస్తోంది. ఇలాగే మౌనంగా ఉంటే రాజకీయాలలో వర్మ తన ఉనికిని కూడా కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.
