మనలో చాలామంది ఎంత కష్టపడినా కొన్నిసార్లు అనుకూల ఫలితాలు కలగవు. ఏలినాటి శని ప్రభావం వల్లే ఈ విధంగా జరుగుతుందని చాలామంది భావిస్తారు. నవ గ్రహాలలో సూర్య భగవానుడిది కీలక స్థానం కాగాసూర్యుడిని ఆదిత్య యాచ అని ప్రార్థించడం జరుగుతుంది. కుంభకోణంలో సూర్యుడు ఇతర గ్రహాలతో వెలిసిన ప్రాంతం ఉంది. ఎవరైతే ఈ ఆలయాన్ని సందర్శిస్తారో వాళ్లకు ఏలినాటి శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది.
ఈ ఆలయం పేరు సూర్యనార్ ఆలయం కాగా ఈ ఆలయంలో సూర్య భగవానుడు మధ్యలో ఉండగా ఆయన చుట్టూ 8 గ్రహాలు ఉన్నాయి. కుంభకోణం నుంచి 15 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆలయాన్ని సులభంగా దర్శించుకోవచ్చు. చక్కెర పొంగలిని ఈ ఆలయంలో నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. కూళోత్తుంగ చోళ మహారాజు ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. చరిత్ర ప్రకారం విజయనగర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయానికి కొంత దూరంలోనే బృహస్పతి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో భక్తులకు సూర్యుడు తన భార్యలతో కలిసి దర్శనమిస్తాడు. కాలాలతో సంబంధం లేకుండా ఈ ఆలయం ఎప్పుడూ వేడిగా ఉంటుందని తెలుస్తోంది. సూర్యునికి ఎదురుగా అశ్వం ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత అని చెప్పవచ్చు. తమిళ మాసం ప్రారంభం సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించడం జరుగుతుంది.
ఈ ఆలయంలో ఘనంగా జరిపే వేడుకలలో రథసప్తమి వేడుక ఒకటనే సంగతి తెలిసిందే. ఈ క్ష్హేత్రంలో నవగ్రహాలను పూజించడం ద్వారా బాధలు తొలగిపోతాయని భక్తులు బలంగా నమ్ముతారు. ఈ ఆలయంలో గరుడని 11 వారాల పాటు పూజించడం వల్ల మంచి ఫలితాలు కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది.