శనివారం ఆంజనేయ స్వామిని ఇలా పూజిస్తే ఎన్ని లాభాలో మీకు తెలుసా?

మన దేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా ఆంజనేయ స్వామికి ఎంతోమంది భక్తులు ఉన్నారనే సంగతి తెలిసిందే. ఆంజనేయస్వామి గుడి లేని గ్రామాలు, పట్టణాలు చాలా అరుదుగా ఉంటాయనే సంగతి తెలిసిందే. మంగళవారం, శనివారం రోజులలో ఆంజనేయ స్వామికి పూజ చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. హనుమంతుడు శనివారం రోజున జన్మించగా ఆ కారణం వల్లే హనుమంతునికి ఎంతో ప్రాధాన్యత ఏర్పడటం గమనార్హం.

హనుమంతునికి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని భక్తులు భావిస్తారు. హనుమంతుడిని పూజిస్తే సకల శ్రేయస్సు కలుగుతుందని పండితులు సైతం చెబుతున్నారు. హనుమంతుడిని భక్తులు హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. హిందూ ధర్మానికి హనుమంతుడు ప్రతీక అని చాలామంది భావిస్తారు. హనుమంతుని జీవితానికి సంబంధించి వేర్వేరు కథలు ప్రచారంలో ఉన్నాయి.

ఆంజనేయుడు జన్మతః బలసంపన్నుడు కాగా శ్రీరాముని గుడిలో సీతారాములకు ఎదురుగా హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించడం ఆనవాయితీగా వస్తోంది. శనివారం హనుమంతునికి తైలాభిషేకం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. హనుమంతునికి అభిషేకం చేయడం వల్ల దేవుని అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. శనివారం రోజున హనుమంతుడికి అభిషేకం చేస్తే దేవుని అనుగ్రహ ప్రాప్తి కలిగే అవకాశాలు అయితే ఉంటాయి.

చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాలలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శనివార వ్రతం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. హనుమంతుడిని పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి. శని మాట తప్పితే కఠినాతి కఠినంగా శిక్షిస్తానని హనుమంతుడు చెప్పినట్టు పురాణాల్లో ఉంది. అందువల్ల హనుమంతుడిని పూజిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.