ET : ‘ఈటి’ ట్రైలర్ రివ్యూ : చాలా కాలం తర్వాత సూర్య మాస్ సినిమా ఏమవుతుందో..?

ET : తమిళ నాట బిగ్గెస్ట్ స్టార్స్ లో హీరో సూర్య కూడా ఒకరు. అలాగే తమిళ్ తో పాటుగా తెలుగు సినిమా దగ్గర కూడా ఎప్పటి నుంచో మంచి మార్కెట్ ఉన్న హీరో కూడా సూర్య నే. అయితే సూర్య కెరీర్ డౌన్ లో ఉంది అనే టైం లో చేసిన రెండు సినిమాలు “ఆకాశం నీ హద్దురా”, “జై భీమ్” చిత్రాలు ఓటిటి లో రిలీజ్ అయ్యి భారీ హిట్స్ అయ్యాయి.

అయితే ఇవి పక్కా క్లాస్ సినిమాలు కాగా సూర్య నుంచి మళ్ళీ ఒక తన వింటేజ్ మాస్ మసాలా సినిమా కోసం అంతా ఆసక్తిగా చూడడం స్టార్ట్ చేశారు. అయితే ఆ సమయంలో దర్శకుడు పాండిరాజ్ తో స్టార్ట్ చేసిన సినిమానే “ఈటి”. తెలుగులో “ఎవరికీ తలవంచడు” అనే టైటిల్ తో డబ్ అయ్యి సిద్ధంగా ఉంది.

మరి ఇప్పుడు ఈ సినిమా నుంచి మాసివ్ ట్రైలర్ ని ఇప్పుడు చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ అయితే ఖచ్చితంగా సూర్య ఫ్యాన్స్ కి మంచి మాస్ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తుంది. ముఖ్యంగా సూర్య లుక్స్ ఈ సినిమాలో చాల ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. దీని బట్టి సూర్య కి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉండొచ్చని అనిపిస్తుంది.

ఇక యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కూడా చాలా అందంగా కనిపించగా సూర్యతో కెమిస్ట్రీ అయితే మరింత బాగుందని చెప్పాలి. అలాగే ఈ సినిమాలో మెయిన్ కాంఫ్లిక్ట్ పాయింట్ కూడా బలంగా ఎలివేట్ అయ్యేలా కనిపిస్తుంది. మొదటి సగం అంతా మంచి ఫన్ గా ఉండగా మిగతా మొత్తం మాత్రం సూపర్ మాస్ లెవెల్లో ఉందని చెప్పాలి.

దీనితో దర్శకుడు పాండిరాజ్ సినిమాని చాలా కాలం తర్వాత సూర్య మార్క్ మాస్ సినిమాగా తీసినట్టే అనిపిస్తుంది. మరి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ చిత్రం ఎంత వరకు సక్సెస్ అవుతుందో తెలియాలి అంటే ఈ మార్చ్ 10 వరకు ఆగాల్సిందే.

ET - Official Trailer (Telugu) | Suriya | Sun Pictures | Pandiraj | D.Imman | Priyanka Arul Mohan