‘శ్యామ్‌ సింగరాయ్‌’కు దక్కని అవార్డులు.. అవార్డులపై కామెట్స్!

అరవై తొమ్మిదవ జాతీయ పురస్కారాల్లో నాని నటించిన ‘శ్యామ్‌ సింగరాయ్‌’కు అవార్డు రాలేకపోవడంపై ఫ్యాన్స్‌ సహా పలువురు నెటిజన్లు ట్వీట్స్‌ వేస్తున్నారు. అవార్డు గెలుచుకోవడానికి అన్ని అర్హతులున్నా ‘శ్యామ్‌సింగరాయ్‌’కు జాతీయ పురస్కారం వరించలేదు. దీనిపై ట్విట్టర్‌లో పెద్ద రచ్చ రచ్చజరుగుతోంది. ఇక నాని ‘జై భీమ్‌’ సినిమాకు అవార్డు రాకపోవడంపై హార్ట్‌ బ్రేక్‌ అయినట్లు ఓ పోస్ట్‌ పెట్టాడు.

ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన’శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా ఏడాదినర్థం కిందట విడుదలై మంచి వసూళ్లు సాధించింది. ద్విపాత్రాభినయంలో నాని నటనకు పట్టం కట్టని ప్రేక్షకుడు లేడు. ముఖ్యంగా బెంగాళీ రచయిత శ్యామ్‌ సింగరాయ్‌ పాత్రలో నాని నటించాడు అనడం కంటే జీవించాడు అనడంలో అతిశయోక్తి లేదు. పునర్జన్మల కాన్సెప్ట్‌తో రాహుల్‌ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అంతే అద్భుతంగా నాని, సాయిపల్లవిలు నటించారు.

కాగా అలాంటి సినిమాకు జాతీయ అవార్డు రావాల్సిందని పలువరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాకు జ్యూరీ అన్యాయం చేసిందని, మంచి సినిమాను గుర్తించలేకపోయిందని నాని ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మేకింగ్‌ ఒక్కటే కాదు.. సినిమాలో పాటలు, ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతీ ఒక్కటి ది బెస్ట్‌ ఉంటుంది. అసమానతలు.. అన్యాయాన్ని ఎదుర్కొనే బెంగాళీ రచయితగా నాని టెర్రిఫిక్‌ పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. 1970ల కాలం నాటి బెంగాళ్‌ వాతావరణాన్ని ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించారు. ముఖ్యంగా అవినాష్‌ సెట్‌ వర్క్‌ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయిర్‌ తన కెపాసిటీకి మించిన అవుట్‌ పుట్‌ ఇచ్చి అందరితో చప్పట్లు కొట్టించుకున్నాడు. ముఖ్యంగా సిరివెన్నెల, రైజ్‌ ఆఫ్‌ శ్యామ్‌ పాటలు తన స్థాయేంటో నిరూపించే విధంగా ఉంటాయి.