Home News స‌ముద్రంలో బ‌ర్త్‌డే వేడుక‌లు.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

స‌ముద్రంలో బ‌ర్త్‌డే వేడుక‌లు.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

కరోనాతో దాదాపు ఏడు నెల‌ల పాటు ఇంటికే ప‌రిమిత‌మైన సెల‌బ్రిటీలు ఫ్యామిలీతో క‌లిసి విహార యాత్ర‌లకి వెళుతున్నారు. చాలా వ‌ర‌కు మాల్దీవుల‌కే వెళుతుండ‌గా, అక్క‌డి అందాల‌ని త‌మ కెమెరాల‌లో బంధించి సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి. ఇవి నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకోవ‌డంతో పాటు కొద్ది క్ష‌ణాల‌లోనే ఫుల్ వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా భార‌త మాజీ క్రికెట‌ర్ సురేష్ రైనా త‌న బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకునేందుకు ఫ్యామిలీతో మాల్దీవుల‌కి వెళ్ళారు.

Raina Aa | Telugu Rajyam

సముద్రంలో తేలియాడుతూ రుచిక‌ర‌మైన భోజనం ఆస్వాదిస్తూ కూతురు, భార్య‌తో ఆనంద క్ష‌ణాల‌ని గ‌డిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని రైనా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌డంతో పాటు “పుట్టినరోజు ఉదయం ఆ రుచికరమైన అల్ఫాహారంతో అత్యంత అందమైన సెట్టింగ్‌‌లో ప్రారంభించాం” క్యాప్షన్‌తో ప‌లు ఫొటోలు షేర్ చేశారు. వీటిని చూసి నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. రానా ప్ర‌స్తుతం 34వ వ‌సంతంలోకి అడుగుపెట్టి న సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానులు, నెటిజ‌న్స్‌, శుభాకాంక్ష‌లు తెలిపారు.

రైనాలో మంచి క్రికెట‌ర్‌తో పాటు మాన‌వత్వం కూడా దాగి ఉంది. ఇటీవ‌ల‌ 34 స్కూళ్ల‌లో శానిటేష‌న్‌, తాగు నీటి స‌దుపాయాలు క‌ల్పించేందుకు వాగ్ధానం చేశాడు. యూపీ, జ‌మ్మూ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఉన్న ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ఈ స‌దుపాయాల‌ను రైనా స్వంతంగా ఏర్పాటు చేయ‌నున్నాడు. ఈ ఏడాది ఆగ‌స్టు 15వ తేదీన అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రైనా రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suresh Raina (@sureshraina3)

- Advertisement -

Related Posts

నరాలు తెగే ఉత్కంఠ: నిమ్మగడ్డ, వైఎస్ జగన్.. గెలిచేదెవరు.?

గంటలు గడుస్తున్న కొద్దీ రాష్ట్రంలో చాలామందిలో నరాలు తెగే ఉత్కంట పెరిగిపోతోంది. వైసీపీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుస్తారా.? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్...

2021లో శృతి హాస‌న్ పెళ్లి.. ఈ ప్ర‌శ్న‌పై క‌మ‌ల్ గారాల ప‌ట్టి ఎలా స్పందించిందంటే!

గ‌త ఏడాది నుండి ఇండ‌స్ట్ర‌లో పెళ్ళిళ్ల హంగామా మ‌స్త్ న‌డుస్తుంది. రానా, నితిన్, నిఖిల్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక‌, సుజీత్ , సునీత ఇలా ప‌లువురు సెల‌బ్రిటీలు త‌మ‌కు న‌చ్చిన వారితో ఏడ‌డుగులు...

పవ‌న్‌ను ఆపలేక చేతులెత్తేసిన వైసీపీ.. మళ్ళీ చంద్రబాబు దగ్గరికే చేరారు 

ఒక వ్యక్తి మీద ఒక విషయంలో ఒక విమర్శ చేయవచ్చు. జనం కూడ దాన్ని వింటారు, పట్టించుకుంటారు.  కానీ అదే వ్యక్తి మీద అన్ని విషయాల్లోనూ ఆ ఒక్క విమర్శనే మళ్ళీ మళ్ళీ...

తూ.గో.జిల్లాను దడదడలాడిస్తూనే ఎమ్మెల్యే.. వైసీపీ నేతలు సైతం సైలెంట్ 

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు జగన్ అండ చూసుకుని హద్దులు దాటిపోతున్న సంగతి తెలిసిందే.  ఇలాంటివారి మూలంగా ఇతర వైసీపీ ఎమ్మెల్యేలే ఇబ్బందులుపడుతున్నారు.  బయటివారినే కాదు సొంత పార్టీ నేతలను కూడ ఈ ఎమ్మెల్యేలు లెక్కచేయట్లేదు.  అంతా...

Latest News