మాజీ సీఎస్ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేస్తూ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కేసు నేడు విచారణకు వచ్చింది. అత్యున్నత న్యాయం స్థానంలోనూ జగన్ సర్కార్ కు మొట్టికాయలు తప్పలేదు. సుప్రీంకోర్టులోనూ ఎదురు దెబ్బే తగిలింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏస్ ఏ బాబ్డే నేతృత్వంలోని జస్టిస్ ఏఎస్ బోపన్న, హృషికేశ్ రాయ్ లతో కూడాని త్రిసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. రాష్ర్ట ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహిత్గీ , రాకేష్ ద్వివేది వాదనలు వినిపించారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ , ఎన్నికల కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఒకవైపు నిబంధనలు కొట్టివేస్తూనే అవే నిబంధనల ప్రకారం రమేష్ కుమార్ ను పదవిలో కూర్చొబెట్టాలని పరస్పర వాదనలు వినిపించిందన్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించడం కోసమే ప్రభుత్వం అర్డినెన్స్ తీసుకొచ్చిందని తెలిపారు. దీంతో బాబ్డే స్పందిస్తూ రాజ్యంగ పదవిలో ఉన్నవారిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
రాజ్యాంగంతో ప్రభుత్వాలు ఆటలాడుకుంటున్నాయా? అని కోర్టు మండిపడింది. ఆర్డినెన్స్ వెనుక ప్రభుత్వ ఉద్దేశాలు అస్పష్టంగా, విరుద్దంగాను ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ కేసులో ప్రతివాదుల చాలా మంది ఉన్నారని, వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నామని కోర్టు తెలిపింది. రెండు వారాల్లో ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని ధర్మాసనం తెలిపింది. హైకోర్టు తీర్పు ప్రకారం రమేష్ కుమార్ కొనసాగించాలని ఆయన తరుపున న్యాయవాదులు వాదనలు వినిపించగా ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి వీలు లేదని రెండు వారాల తర్వాత ఈ వ్యవహరం తేలుదుందని అత్యున్నత న్యాయ స్థానం తెలిపింది.