మాజీ సీఎస్ఈ నిమ్మగడ్డ వ్యవహారం సుప్రీకోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ పదవిలో నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు వ్యవహారాన్ని సాకుగా చూపించి జగన్ సర్కార్ ఎలాగైనా మళ్లీ నిమ్మగడ్డని ఇరకాటంలో పెట్టాలని చేసే ప్రయత్నాలు ఉంటాయని కథనాలొచ్చాయి. సుప్రీంకోర్టు పైనే ప్రభుత్వం ఇప్పుడు ఆశలు పెట్టుకుంది. కానీ ఇప్పుడా ఆశలు అడియాశలే అయ్యాయి. తాజాగా నేడు ఈ కేసు విచారణకు రాగా జగన్ సర్కార్ కి పెద్ద షాక్ తప్పలేదు. గవర్నర్ ఇచ్చిన ఆదేశాల్ని వచ్చే శుక్రవారం లోగా అమలు చేయాలని కచ్చితంగా చెప్పింది.
గవర్నర్ ప్రభుత్వానికి లేఖ పంపినా పోస్టింగ్ ఇవ్వరా? అని ప్రశ్నించింది. ఈకేసులో జరుగుతోన్న అన్ని విషయాలు కోర్టుకు మొదటి నుంచి తెలుస్తూనే ఉందని మెట్టికాయలు వేసింది. అసలు ఏపీలో ఏం జరుగుతుందో అర్ధం కాలేదంటూ మండిపడ్డినట్లు సమాచారం. స్టే ఇచ్చేది లేదు. గవర్నర్ లేఖపై వారం రోజుల్లోగా ఏదో ఒకటి తేల్చండని కోర్టు తేల్చిచెప్పింది. ఇప్పటికే ఈ కేసు విషయంలో తొలి సారి విచారణలో భాగంగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పు ప్రకారం నియమించాల్సిందేనని గవర్నర్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చారు. ఇంతలో నేడు కేసు సుప్రీంలో విచారణకు రావడం మొట్టి కాయలు వేడయం జరిగింది.
ఇక గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం సహా పలు కేసుల్లో సుప్రీం షాక్ ప్రభుత్వానికి తగిలిన సంగతి తెలిసిందే. పచ్చ మీడియా కథనాల విషయంలో మాత్రమే సర్కార్ కి అనుకూలంగా సుప్రీం తీర్పునిచ్చింది. ఈ కోర్టులు తీర్పులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఆగ్రహం వ్యక్తం చేసారు. మరి తాజా తీర్పుతో జగన్ కి ఉన్న అన్ని దారులు మూసుకుపోయినట్లే? అంటే అనడానికి లేదు. నిమ్మగడ్డపై ప్రభుత్వం ఎలాంటి ఆపరేషన్ అయినా చేయగలదు. ఇప్పటికే చంద్రబాబు సన్నిహితులతో నిమ్మగడ్డ నెరిపిన పార్క్ హయత్ రహస్య సమావేశంపై వైకాపా దృష్టిపెట్టింది.