అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ..

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. ఎన్నో సినిమాల్లో నటించి మంచి స్టార్ హోదాను సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా తన వారసులను కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇదిలా ఉంటే ఈయన తాజాగా అరుదైన గౌరవంను సొంతం చేసుకున్నాడు.

ఈరోజు ఈయన 80 వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో ఈయనకు తన కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా ఈయనకు ‘సెలబ్రిటీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ అనే గౌరవం కూడా అందింది. ఈ విషయాన్ని నరేష్ తన ట్విట్టర్ వేదికగా తెలుపుతూ.. ఆయన 80 ఏళ్ళ పాటు సినిమాకు, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందింది అని.. ఆయన ఎప్పుడు కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరాడు.