ఐపీల్ – పంజాబ్ XI vs ఢిల్లీ క్యాపిటల్స్ – నరాలు తెగే ఉత్కంఠ

Delhi Capitals Vs Punjab XI

పంజాబ్ XI, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈరోజు జరిగిన ఐపీల్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ తో కొనసాగింది. అసలు ఐపీఎల్ కి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చిందో తెలియాలంటే ఈ మ్యాచ్ చూసుంటే అర్థమయ్యేది.

Delhi Capitals Vs Punjab XI

మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 157 పరుగులు సాధించింది. 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ XI ఒక పక్క వికెట్లు కోల్పుతున్న లక్ష్యఛేదనలో ముందుకు సాగుతూ వచ్చింది. చివరి ఓవర్ కి పంజాబ్ XI విజయం సాధించాలంటే 13 పరుగులు చేయవలసి ఉంది. అయితే మొదటి మూడు బంతుల్లోనే 12 పరుగులు సాధించిన పంజాబ్ XI , తరువాత మూడు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి సున్నా పరుగులు చేసింది. దీంతో పంజాబ్ XI స్కోర్ 157 దగ్గర ఆగిపోవడంతో మ్యాచ్ టై గా ముగిసింది

ఐపీఎల్లో టైగా ముగిసిన మ్యాచ్ సూపర్ ఓవర్ తో విజేత ని నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్లో ఒక టీం మరొక టీంకి మూడు బంతులు వేస్తోంది. ఆ మూడు బంతుల్లో ఎవరు ఎక్కువ పరుగులు సాధిస్తే వారు గెలిచినట్టు. సూపర్ ఓవర్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ XI మూడు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు సాధించి రెండు వికెట్లు కోల్పోయింది. మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి బంతికి సున్నా పరుగులు సాధించింది. దీంతో ఉత్కంఠ పెరగడం మొదలైంది. అయితే రెండో బంతి షమీ వైడ్ వేయడంతో ఒక బంతికి ఒక పరుగు సాధించినట్టు అయింది. ఈ సమయంలో విజయానికి ఢిల్లీ క్యాపిటల్స్ కు రెండు బంతుల్లో రెండు పరుగులు కావాలి. మహమ్మద్ షమీ వేసిన రెండో బంతికి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ పంత్ రెండు పరుగులు తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడం జరిగింది.

ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరగా ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడానికి వారి ఆటతీరు ఒక కారణం అయితే పంజాబ్ XI వ్యూహాత్మక లోపాలు కూడా కారణం అయ్యాయి. కారణాలు ఏమైనప్పటికీ ఇటువంటి మ్యాచ్ లే ఐపీఎల్ అంటే జనాల్లో విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చాయి. ప్రేక్షకులకి ఉత్కంఠ తో పాటు వినోదాన్ని కూడా అందిస్తుంతుంది ఐపీల్.