లేడీ బిగ్‌బాస్ భలే ఛాన్సు కొట్టేసిందిగా.!

ఇమేజ్ ఉన్న వాళ్లకి డ్యామేజ్ తీసుకురావాలన్నా, ఎలాంటి ఇమేజ్ లేకున్నా, సరికొత్త క్రేజ్ తీసుకురావాలన్నా ఒకే ఒక్క ఛాన్స్ బిగ్‌బాస్ రియాల్టీ షో లో ఛాన్స్ దక్కించుకోవడం. ఒక్కసారి బిగ్ హౌస్‌లో అడుగు పెడితే చాలు ఆ కిక్కే వేరప్పా. లక్కుంటే, ఆ లెక్కే వేరప్పా.

అందుకే బిగ్‌బాస్ రియాల్టీ షో కున్న క్రేజ్ వేరే లెవల్ అంతే. ఇంతకీ అసలు విషయం ఏంటంటారా.? బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ అయిన లహరి షెరు గుర్తుంది కదా. కేవలం మూడు వారాల్లోనే హౌస్ నుండి బయటికొచ్చేసిందీ అమ్మడు. హౌస్‌లో ఉన్నది తక్కువ రోజులే అయినా, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది లహరి.

బిగ్‌బాస్ వీక్షకుల నుంచి బోలెడంత సానుభూతి సంపాదించుకోవడమే కాదు, అదృష్టం కూడా కొంగున ముడేసుకుని వచ్చేసింది. హౌస్ నుంచి బయటికొచ్చాకా కూడా లహరికున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోందీ అమ్మడు.

తాజాగా లహరి షెరు నటించిన ఓ ఫోక్ సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆల్రెడీ ‘అర్జున్ రెడ్డి’ జాంబి రెడ్డి’ తదితర సినిమాల్లో నటించి పెద్ద తెరతో పరిచయం ఉన్న ఈ భామకు బిగ్‌బాస్ తర్వాత క్రేజీ ఆపర్లు తలుపు తడుతున్నాయట. త్వరలోనే సినిమాలకు సంబంధించి ఓ గుడ్ న్యూస్‌ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటానని చెబుతోంది. బహుశా ఏ సినిమాలోనైనా మెయిన్ హీరోయిన్ ఛాన్స్ దక్కించేసుకుందేమో అందాల లహరి.