ఇలాగైతే, చాలా కష్టం బిగ్ బాసూ.!

దీపావళి కోసం ముందే ఈవెంట్ ప్లాన్ చేయడమేంటి చెప్మా.? వీకెండ్ ఎపిసోడ్లకు వీక్షకుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో, సెలబ్రిటీల్ని రంగంలోకి దించుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. విజయ్ దేవరకొండ సహా పలువురు సెలబ్రిటీలు వచ్చారు. సుమ తదితరులూ హంగామా చేశారు.

ఇంత చేసినా, బిగ్ బాస్ షోని వీకెండ్‌లో తిలకించినవారెంతమంది.? ప్చ్.. నెంబర్స్ చాలా తక్కువగా వున్నాయన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ‘ఇంట్రెస్ట్ పోయింది బిగ్ బాసూ..’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. లోబో వికెట్ పడిపోతుందని తెలుసు కాబట్టి, ఎలిమినేషన్ కోసం ఆడిన డ్రామా వర్కవుట్ కాలేదు.

అసలు హౌస్‌లో వున్నోళ్ళయినా, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారా.? అంటే అదీ లేదు. మొత్తం ‘రొట్ట బ్యాచ్’ అనే విమర్శలు సోషల్ మీడియాలో పడుతున్నాయ్. షన్నూ ఎక్కడ.? ఏం చేస్తున్నాడు.? అని ప్రతిసారీ వెతుక్కోవాల్సి వస్తోంది. నిజానికి, ఈ సీజన్ కోసం బాగా హైప్ క్రియేట్ అయిన కంటెస్టెంట్ అతడే మరి.
ఎంతో అనుభవం వున్న రవి కూడా ఏమీ చేయలేకపోతున్నాడు. విజయ్ దేవరకొండ, సుమ, బిగ్ బాస్ 4 సీజన్ కంటెస్టెంట్లు, అవికా గోర్, శ్రియ.. ఇంతమందితో వీకెండ్ షో ప్లాన్ చేసినా.. అది కూడా తుస్సుమంది.