ఐపీఎల్ 2020 సీజన్ ప్లేఆఫ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం అడుగుపెట్టింది. ముంబయి ఇండియన్స్‌తో షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో అదరగొట్టిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత ఛేదనలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (85 నాటౌట్: 58 బంతుల్లో 10×4, 1×6), సాహా (58 నాటౌట్: 45 బంతుల్లో 7×4, 1×6) అజేయ హాఫ్ సెంచరీలు బాదడంతో 10 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. తాజా సీజన్‌లో ఇప్పటికే ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్‌కి చేరగా.. చివరి బెర్తుని హైదరాబాద్ దక్కించుకుంది. దాంతో.. కోల్‌కతా నైట్‌రైడర్స్ టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు.
మెుదట బ్యాటింగ్ చేసిన ముంబై ఆరంభంలో దాటిగా ఆడిన ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులో చేరి.. ఓపెనర్ బరిలోకి దిగాడు. కానీ స్వల్ఫ పరుగులకే రోహిత్(4) ఔటై నిరాశపరిచాడు. సందీప్ శర్మ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి వార్నర్ చేతికి చిక్కాడు. మరో ఓపెనర్ డికాక్‌ను సందీఫ్ బౌల్డ్ చేశాడు. అతను వేసిన ఐదో ఓవర్‌లో వరుస రెండు సిక్స్‌లు కొట్టిన డీకాక్ ఆ ఓవర్ ఐదో బంతికి బౌల్డ్ అయ్యాడు.ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్-ఇషాన్ కిషన్‌లు కొంతసేపు దాటిగా ఆడిన సన్ బౌలర్లు ముందు ఎక్కువ సేపు నిలవలేకపోయారు ముంబై 82 పరుగుల స్కోరు చేరే సరికి ఐదు వికెట్ల నష్టపోయి కష్టాల్లో పడింది. చివరలో పొలార్డ్(41) దాటిగా ఆడడంతో ముంబై నిర్ణిత 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ మూడు వికెట్లు తీయగా, నదీమ్,హోల్డర్ చెరో రెండు వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్‌కు వికెట్ దక్కింది.
A 10-wicket win over #MumbaiIndians as @SunRisers Qualify for #Dream11IPL 2020 Playoffs. pic.twitter.com/j1Ib16fw6b
— IndianPremierLeague (@IPL) November 3, 2020
ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు అద్భుతంగా రాణించడంతో ముంబై నిర్ధేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేధించింది. 10 వికెట్లతో తేడాతో ఘన విజయాన్ని నమోదుచేసుకుంది.ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (85; 58 బంతుల్లో, 10×4, 1×6), వృద్ధిమాన్ సాహా (58; 45 బంతుల్లో, 7×4, 1×6) అజేయ అర్ధశతకాలతో చేలరేగిపోయారు. వారి దాటికి ముంబై బౌలర్లు దాసోహం అయ్యారు. మెుదట కులకర్ణి వేసిన తొలి ఓవర్లో 3 పరుగులే వచ్చిన.. ఇక రెండో ఓవర్ నుంచి సన్‌రైజర్స్ బాట్స్‌మెన్స్ రెచ్చిపోయారు. కౌల్టర్‌నైల్ వేసిన ఆ ఓవర్లో సాహా అద్భుతమైన బ్యాటింగ్ చేసి.. వరుసగా సిక్సర్, బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అప్పటినుంచి మెుదలైన జోరు చివరి వరకు అగలేదు. ఓపెనర్లు బ్యాటింగ్ మెరుపులతో ఎలాంటి ఓడిదుడుకులు లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం వైపు దూసుకెళ్ళింది. 17.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.