విజే గా బాగా ఫేమస్ అయిన సన్నీ తర్వాత బుల్లితెర మీద సీరియల్స్ లో నటిస్తూ మరింత ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పార్టిసిపేట్ చేసిన సన్నీ బిగ్ బాస్ టైటిల్ దక్కించుకున్నాడు. దీంతో సన్నీ పాపులారిటీ మరింత పెరిగిపోయింది. బిగ్ విన్నర్ గా బాగా క్రేజ్ సంపాదించుకున్న సన్నీకి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం సన్నీ సీరియల్స్ మానేసి పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టాడు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సన్నీ ఇప్పటికే ఒక సినిమాలో నటించాడు. తాజాగా మరొక చిత్రంలో కూడ నటించనున్నాడు.
సన్నీ ప్రస్తుతం “సన్నాఫ్ ఇండియా” ఫేమ్ డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక సినిమాలో నటించనున్నారు. ఈ మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు, మూవీ లాంచ్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖుల మధ్య జరిగాయి. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే సన్నీ నటించబోయే కొత్త సినిమాకి ” అన్‌స్టాపబుల్ ” అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అయితే బాలకృష్ణ డిజిటల్ స్క్రీన్ మీద హోస్ట్ చేసిన మొట్టమొదటి షో ” అన్‌స్టాపబుల్ వీత్ ఎన్బీకే ” . ఈ షో ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.
తాజాగా బాలకృష్ణ హోస్ట్ చేసిన టైటిల్‌తో సన్నీ సినిమా చేస్తుండటంతో దీనిపై ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో సన్నీ మాట్లాడుతూ ఒక నటుడిగా ప్రేక్షకులను ఒప్పించడానికి నా వంతు 100% కృషి చేస్తాను. ఈ సినిమాలో ఎంతో మంది సీనియర్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు పని చేస్తున్నారు. అంతేకాకుండా జబర్దస్త్ కమెడియన్స్, గబ్బర్ సింగ్ బ్యాచ్ ఇలా దాదాపు 200 మంది ఆర్టిస్టులను ఇప్పటికే ఎంపిక చేశారు. జూన్ 9వ తేదీ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది…అంటూ సన్నీ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా నటి అక్సాఖాన్ మాట్లాడుతూ … ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులతో పనిచేయటం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది
