పోర్న్ స్టార్‌గా పరిచయమై బాలీవుడ్‌లో హీరోయిన్‌గా, ఐటెం గాళ్‌గా మోస్ట్ పాపులర్ అయ్యింది ముద్దుగుమ్మ సన్నీలియోన్. హీరోయిన్ అయ్యాకా, తన పోర్న్ కెరీర్ ఛాయలు తనపై లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. అందులో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.
ఇకపోతే, సన్నీ తన జీవితంలో కేవలం గ్లామర్‌కే కాదు, ఉన్నతమైన పర్సనల్ లైఫ్‌కీ చోటిచ్చింది. డేనియల్ వెబర్‌ని పెళ్లి చేసుకుని ఓ ఇంటిదయ్యింది. అంతటితో ఆగలేదు. ఓ ఆడపిల్లను దత్తత తీసుకుని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేలా చేసింది. సరోగసీ ద్వారా మరో ఇద్దరు కవల పిల్లలతో సహా ముగ్గురు పిల్లలకు బాధ్యత గల తల్లిగా శభాష్ అనిపించుకుంటోంది సన్నీలియోన్.
ఇటు పర్సనల్ లైఫ్‌నీ, అటు ప్రొఫిషనల్ లైఫ్‌నీ ఎంతో చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటోంది. ఇకపోతే, తన దత్తత కూతురుకు సంబంధించి తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది సన్నీ. ఎప్పటికైనా తన దత్తత కూతురుకు సంబంధించి నిజా నిజాల్ని తనకు చెప్పేస్తాననీ, తన కన్నతల్లి గురించి, ఆమె పుట్టుక గురించి పూర్తి వివరాలు ఆమెకు అర్ధమయ్యేలా చెప్పాల్సిన అవసరం తనకుందని సన్నీ చెప్పుకొచ్చింది.
సన్నీ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ, నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దటీజ్ సన్నీలియోన్.