సన్నీ లియోన్.. భారత్‌లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక ఈ అందాల తారకు సంబంధించిన ఫోటోలు కానీ, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అదే క్రమంలో తాజాగా సన్నీలియోన్‌కు సంబంధించిన ఓ వార్త నెటింట్లో తెగ సర్కులేట్ అవుతుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీతో సన్నీ లియోన్‌కు ఇప్పటికే పెళ్లి అయిందని.. ఈ జోడీకి డిగ్రీ చదివే కొడుకున్నాడన్నది ఆ వార్త సారాశం. ఇది కాస్తా సన్నీ లియోన్ కంటపడగా ఆమె తేలికగా నవ్వేడమే కాదు..ఆ డిగ్రీ విద్యార్థిని అభినందించారు కూడా. ఆ విద్యార్థి చేసిన తుంటరి పనికి ఏమీ అనలేక చమత్కరించారు.
అసలేం జరిగిందంటే.. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో కుందన్ కుమార్ అనే 20 ఏళ్ల యువకుడు ధనరాజ్ మహ్తో డిగ్రీ కాలేజీలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతడు తప్పుడు వివరాలతో పరీక్ష హాల్ టికెట్‌కు దరఖాస్తు చేశాడు. తల్లి పేరు రాయాల్సిన కాలమ్‌లో సన్నీలియోన్ అని, తండ్రి అని ఉన్న దగ్గర ఇమ్రాన్ హష్మీ అన్న రాసుకొచ్చాడు. తల్లిదండ్రుల పేర్లు బాలీవుడ్ సెలబ్రిటీలను సూచిస్తుండటంతో ఆ ఎక్జామ్ అప్లికేషన్ ఫామ్ ప్రజంట్ వైరల్‌గా మారింది. తుంటరి పని చేసిన సదరు విద్యార్థిపై చర్యలు తీసుకుంటామని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. అయితే బాలీవుడ్ భామ సన్నీ లియోన్ మాత్రం ఆ విద్యార్థి చేసిన పనికి సరదాగా నవ్వుకున్నారు. అతడిని అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. అతడు ఇలాగే ఎప్పుడూ పెద్ద పెద్ద కలలు కంటూ ఉండాలి అని చమత్కరించారు.
అందరు శృంగార తారగా భావిస్తారు కానీ..సన్నీ లియోన్ మనసు ఎంతో స్వచ్చమైనది. ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఓ అనాథ బాలికను సైతం దత్తత తీసుకున్నారు. 300 మంది పిల్లలున్న ఓ స్కూల్ ను దత్తత తీసుకొని వారికి కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చింది. మరోవైపు చెన్నై స్వగర్ అనే క్రికెట్ జట్టును కొనుగోలు చేసి క్రీడా వ్యాపారరంగంలోనూ తన లక్ టెస్ట చేసకుంది. సన్నీలియోన్ కాలిఫోర్నియా మహిళా సాకర్ టీం తరుపున కూడా ప్రదర్శన చేసింది.