తన కిరాణా కొట్టు బిజినెస్ గురించి స్పందించిన సుమన్ శెట్టి.. ఇంట్లో వాళ్లకి ఆ విషయాలు తెలియవంటూ!

సుమన్ శెట్టి తెలుగు చలనచిత్ర హాస్య నటుడు. ఇతను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో నటించాడు. సినీ రచయిత సత్యానంద్ ఇతనిలోని నటుడును గుర్తించి సినిమాలలో ప్రయత్నించమన్నాడు. దర్శకుడు తేజ ఇతనిని జయం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.

ఇతని ప్రత్యేకమైన సంభాషణలు, భావప్రకటన ఇతనికి సినిమాలలో వరుస అవకాశాలను తెచ్చిపెట్టాయి. వరుస అవకాశాలతో తెలుగు ఇండస్ట్రీలోనే కాక దక్షిణ భారతదేశంలోని ఇతర భాషలలో అనేక అవకాశాలు రావడంతో మంచి పేరు, గుర్తింపు పొందాడు. తనదైన శైలిలో కెరీర్లో ముందుకు దూసుకుపోతున్న సుమన్ శెట్టి గతంలో ఒక మీడియా ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.

ఆ ఇంటర్వ్యూలో తనను తెలుగు సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. దానికి గల కారణం ఏంటని ప్రశ్నించడం జరిగింది. అందుకు తాను అటువంటిదేమీ లేదు ఏ భాషలో అవకాశం వస్తే ఆ భాషలో నటిస్తున్నానని దాదాపు 20 సంవత్సరాలుగా సినీ ఫీల్డ్ లో రాణిస్తున్నానని పేర్కొనడం జరిగింది.

ఆ తరువాత తనపై చాలా రకాల పుకార్లు వచ్చాయి కదా. మీరు చనిపోయారు అంటూ వార్తలు వచ్చాయి. మరొకవైపు కిరాణా కొట్టు నడుపుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు అని అడగడం జరిగింది. అందుకు సుమన్ శెట్టి నవ్వుతూ సోషల్ మీడియాలో ఇలాంటి పుకార్లు ఇండస్ట్రీలో చాలామంది నటులు ఎదుర్కొన్నారు.

సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారని చెబుతూ, ఇంట్లో కుటుంబ సభ్యులకు ఇలాంటి విషయాలు తెలిస్తే ఏ విధంగా తీసుకుంటారు. దయచేసి ఈ మీడియా ద్వారా అలాంటి రూమర్స్ పుట్టించే వాళ్ళు మానుకోవాలి అని తెలపడం జరిగింది.

తన ఇంట్లో తన భార్య, తల్లికి ఇలాంటి విషయాలు తెలియవు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, సంతోషంగా ఒక భాషలో కాకుంటే మరొక భాషలో అవకాశాలు వస్తున్నాయని తెలిపాడు. సినీ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు కాస్త గ్యాప్ రావడం సర్వసాధారణం అని పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం తమిళ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు సమాచారం.