Sukumar: తను లేకుండా ఇప్పటివరకు సినిమా చేయలేదు… ఇకపై చెయ్యలేను కూడా: సుకుమార్

Sukumar: ఆర్య సినిమా ద్వారా దర్శకుడుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు డైరెక్టర్ సుకుమార్. మొదటి సినిమానే మంచి సక్సెస్ కావడంతో ఈయన తదుపరి సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా తెలుగులో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందారు.

ఇక సుకుమార్ చేసిన కొన్ని సినిమాల్లో కలెక్షన్ల పరంగా నిరాశపరిచిన సినిమాలు పట్ల మాత్రం ప్రేక్షకులకు మంచి అభిప్రాయమే ఉందని చెప్పాలి. ఇలా సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు పొందారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పుష్ప 2. ఈ సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమాలోని పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇలా మ్యూజికల్ పరంగా కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అనే విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్రబృందం థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నా పేరు సుకుమార్ కాదని సుకుమార్ దేవిశ్రీప్రసాద్ అని తెలియజేశారు. ఎందుకంటే నేను డైరెక్టర్ గా నా సినీ ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి దేవిశ్రీప్రసాద్ మాత్రమే నా సినిమాలకు సంగీతం అందిస్తున్నారు.

దేవి లేకుండా నేను ఇప్పటివరకు ఒక సినిమా కూడా చేయలేదు. నా ప్రతి ఒక్క సినిమాకు ఆయనే సంగీతం అందిస్తున్నారు. ఇకపై దేవి శ్రీ ప్రసాద్ మాత్రమే నా సినిమాలకు సంగీతం అందిస్తారని ఆయన లేకుండా నేను సినిమాలు చేయలేను అంటూ సుకుమార్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది వీరిద్దరికీ విభేదాలు రావడం వల్లే పుష్ప 2 కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సంప్రదించారు అంటూ వార్తలు వచ్చాయి కానీ సుకుమార్ మాత్రం ఈ వార్తలను ఇలా కొట్టి పారేశారు.

దేవీ ఏ డైరెక్టర్ తో పని చేసినా రాని అవుట్‌పుట్ సుకుమార్ సినిమాలకు వస్తుంది. అది వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్, అండర్‌స్టాండింగ్. సుకుమార్ సినిమాలకు దేవీ ఇచ్చే మ్యూజిక్ చాలా స్పెషల్ గా ఉంటుంది. అందుకే సుకుమార్ ప్రతి ఒక్క సినిమాకు దేవిశ్రీప్రసాద్ ను ఎంపిక చేసుకుంటారని చెప్పాలి.