పెళ్లి కాకుండానే అత్తారింట్లో వరలక్ష్మీ వ్రతం చేసిన జోర్దార్ సుజాత.. ఫోటోలు వైరల్!

బుల్లితెర పై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది జోడీల మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేసి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా లవ్ ట్రాక్ క్రియేట్ చేసి ఫేమస్ అయిన వారిలో రష్మీ సుధీర్, ఇమ్మానియేల్ వర్ష, జంటలు ఒకటని చెప్పాలి అలాగే జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ జంట కూడా ఒకటి. వీరిద్దరు కూడా పలు స్కిట్ లలో జంటగా చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే వీరిద్దరి కేవలం రీల్ లైఫ్ లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి.

ఇకపోతే రాకింగ్ రాకేష్ జబర్దస్త్ వేదికపైనే వాలెంటెన్స్ డే సందర్భంగా సుజాతకు రింగ్ తొడిగి ప్రపోజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. అప్పటినుంచి వీర ప్రేమ వ్యవహారం బయటపడటంతో తరచూ వీరు ఇద్దరు ఒకే స్కిట్ లో సందడి చేయడమే కాకుండా స్నేహితులతో కలిసి పలు హాలిడే వెకేషన్ వెళ్తూ ఎంజాయ్ చేశారు. ఇదిలా ఉండగా తాజాగా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా జోర్దార్ సుజాత పెళ్లి కాకుండానే రాకింగ్ రాకేష్ ఇంటికి వెళ్లి వరలక్ష్మి వ్రతం చేశారు. ఈ వరలక్ష్మి వ్రతం పూజకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

రాకేష్ వాళ్లు బ్రాహ్మిన్ కుటుంబానికి చెందిన వారని సాధారణంగా బ్రాహ్మిన్స్ అంటేనే ఎక్కువగా పూజలు నోములు వ్రతాలు చేస్తుంటారు. మా ఇంట్లో పూజలు పెద్దగా చేయమని అందుకే తనకు వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో తెలియకపోవడంతో రాకేష్ వాళ్ళు ఇంటికి వచ్చి పూజ ఎలా చేయాలో తెలుసుకుంటున్నానని ఈమె తెలిపారు. ప్రస్తుతం రాకేష్ ఇంట్లో వరలక్ష్మి వ్రతపూజ చేస్తున్నానని వచ్చే ఏడాది ఎక్కడుంటానో తెలియదు ఆ ఏడాది పూజ చేయడానికి నాకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఈమె వరలక్ష్మీ వ్రతం చేశారు.ప్రస్తుతం ఈ పూజకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ కావడంతో ఎంతోమంది నెటిజన్ లు ఈ వీడియో పై స్పందిస్తూ పెళ్లి కాకుండా అత్తారింట్లో వరలక్ష్మి వ్రతం చేశారు అంటూ కామెంట్ లు చేస్తున్నారు.