Suicide: కృష్ణా జిల్లాలో అప్పుల బాధలకు బలైన చేనేత కుటుంబం..!

Suicide: ఈ రోజుల్లో చాలా మంది వారి సొంత కారణాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణాజిల్లాలో ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. కృష్ణాజిల్లా పెడనలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక ఒక చేనేత కుటుంబం తమ ప్రాణాలు కోల్పోయారు. లాక్ డౌన్ కారణంగా తీసుకున్న అప్పులకు రోజురోజుకీ పెరుగుతున్న వడ్డీలు కట్టలేక, ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కృష్ణాజిల్లా పెడన కు చెందిన కాసిన పద్మనాభం (52), నాగ లీలావతి (45) దంపతులకు రాజ నాగేంద్ర (24) అను కుమారుడు ఉన్నాడు. ఈ దంపతులు మగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. వారు మగ్గాలు నేయటం వల్ల వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో అప్పులు చేశారు. తీసుకున్న అప్పు కు రోజురోజుకి వడ్డీలు పెరిగిపోవడంతో అప్పులు కట్టలేక తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

మగ్గాలు నేసి జీవనం సాగిస్తున్న ఈ కుటుంబ సభ్యులు అప్పుల బాధ భరించలేక ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి సమయంలో వారు ముగ్గురు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి మరణానికి కారణమైన అప్పులు ఎంత వరకు ఉన్నాయో అన్న విషయం గురించి పోలీసులు ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ప్రతిరోజు ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుల బాధతో ఇలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.