Suhas: గుండు కొట్టించుకోవడానికి అంతనా.. సుహాస్ డిమాండ్ మాములుగా లేదుగా!

Suhas: కలర్‌ ఫోటో ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి చిత్రంతోనే ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇటీవలే ఒక ఫ్యామిలీ డ్రామా అనే చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందిన ఈ హీరో ప్రస్తుతం నాలుగు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా తాజాగా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

అయితే ఈ సినిమా కోసం సుహాస్ కాస్త రెమ్యూనరేషన్ కూడా పెంచారని వార్త ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 40 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సుహాస్ ఈ సినిమా కోసం మరో ఐదు లక్షలు డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించాలంటే తనకు మరొక ఐదు లక్షలు రెమ్యూనరేషన్ పెంచాలని సుహాస్ కోరడంతో ఆయన డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సానుకూలంగా ఉన్నారని సమాచారం.

సుహాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో పాటు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే ఈ సినిమాలో గుండు పాత్రలో నటించడం వల్ల రెమ్యూనరేషన్ అధిక మొత్తంలో డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో గుండు పాత్రలో నటించడం వల్ల తాను ఒప్పుకున్న ఇతర సినిమాలలో నటించే అవకాశం లేదు కనుక ఆ నష్టాన్ని ఈ సినిమా నిర్మాతలు భరించాల్సి ఉంటుంది. కనుక రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేశారని ఇతను డిమాండ్ చేస్తున్న పారితోషకం చెల్లించడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉండటంతో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతోందని తెలుస్తోంది.