ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ ఉరుకుల పరుగుల జీవితానికి అలవాటు పడి అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా జీవిత గమనంలో పరిగెత్తి అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకుంటే రాత్రి సమయాల్లో తీవ్రమైన పాదాల నొప్పి కారణంగా నిద్రలేమి సమస్యను చాలామంది ఎదుర్కొంటుంటారు. రోజంతా నిలబడి పనిచేయడం, ఒకే చోట కూర్చోవడం వంటి కారణాలతో పాదాల్లో తీవ్రమైన నొప్పి, మంట, తిమ్మిర్లు మనల్ని తీవ్రంగా బాధిస్తాయి. ఇలాంటి సమస్య నుంచి బయటపడడానికి మన ఇంట్లో కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
తీవ్రమైన పాదాల నొప్పులు, మంట సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ నానబెట్టిన లేదా మొలక కట్టిన మెంతి గింజలను ఖాళీ కడుపుతో తింటే మంచి ఫలితం ఉంటుంది. మెంతులు తినలేని వారు మెంతులను నానబెట్టిన నీళ్లను కూడా తాగవచ్చు. ఇలా కొన్ని నెలలపాటు చేస్తే మెంతుల్లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో నొప్పి, వాపు లక్షణాలను తొలగిస్తాయి. అలాగే రాత్రిపూట ఆవాల నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత పాదాలను బాగా మసాజ్ చేయండి. ఇది మీకు నొప్పి నుండి చాలా ఉపశమనం ఇస్తుంది.
ఒక కప్పులో రెండు టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, అర టీస్పూన్ తేనె కలిపి ప్రతిరోజు ఉదయాన్నే సేవిస్తే
ఆపిల్ సైడర్ వెనిగర్ లో అనాల్జేసిక్ గుణాలు, సహజ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఇవి
కండరాలు, నరాల రిలాక్స్ చెంది నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాల్లో నొప్పి, తిమ్మిర్లు, వాపు వంటి లక్షణాలు కనిపించడానికి ముఖ్య కారణం రక్తప్రసరణ వ్యవస్థలో లోపాలు తలెత్తడం. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజు ఓ గంటసేపు వ్యాయామం, యోగ, ధ్యానం, నడక వంటివి అలవాటు చేసుకుంటే మీరు పాదాల నొప్పి, వాపు, తిమ్మిర్లు నుండి ఉపశమనం పొందుతారు.