గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా… ప్రతిరోజు ఇవి తినాల్సిందే?

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో గుండె సంబంధిత వ్యాధులు వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఖర్జూరం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఖర్జూరం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలగటమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తాయి. ప్రతిరోజు ఖర్జూరం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఖర్జూరంలో ఉండే ఎన్నో పోషక విలువలు మన శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో ఉపయోగపడతాయి. తరచుగా ఖర్జూరాలను తినటం వల్ల శరీరంలో రక్తహీనత సమస్య దరిచేరకుండా ఉంటుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కూడా ఖర్జూర ఎంతో ఉపయోగపడుతుంది. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం, పొటాషియం, పాలీఫెనోలిక్ తో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోకుండా కాపాడటమే కాకుండా రక్తం గడ్డ కట్టకుండా నివారిస్తుంది. అంతేకాకుండా ఖర్జూరంలో ఉండే పోషకాలు సిరలు గట్టి పడకుండా కాపాడుతాయి.

ప్రతిరోజు 2 ఎండు ఖర్జూరాలను నీటిలో నానబెట్టి ఉదయం లేవగానే వాటిని తినటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నివారిస్తాయి. అందువల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరిగి హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు 2 గ్రాముల షుగర్ శాతం కూడా తగ్గుతుంది. అంతేకాకుండా రక్తంలో కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా తగ్గిస్తాయి. జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ కథనంలో, 6 వారాల పాటు రోజుకు 2 ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ 5 శాతం తగ్గటంతోపాటుగా, రక్తంలో కొవ్వును 5 శాతం ఆక్సీకరణం చేసినట్లు ధృవీకరించారు.