Dandruff Removal: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా… ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!

Dandruff Removal: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా స్త్రీ పురుషులు అందరూ అందంగా కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందంగా కనిపించటానికి అందరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందంగా కనిపించడానికి చర్మ సౌందర్యం ఎంత ముఖ్యమో నల్లటి పొడవైన జుట్టు కూడా అంతే ముఖ్యం. ఒక మనిషి అందంగా కనిపించడంలో జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం పెరిగిపోవటం వల్ల అనేక జుట్టు సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా చుండ్రు, జుట్టు రాలటం, జుట్టు చిట్లిపోవటం వంటి సమస్యలు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి. చుండ్రు సమస్య తగ్గించటానికి ఉపయోగపడే కోన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

చుండ్రు సమస్య ఎక్కువ వేధిస్తుంటే బయట మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ఉపయోగించకుండా ఇంట్లో ఉండే కొన్ని పదార్ధాలతో చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు.మొదటగా రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం తీసుకుని దానిలో కొన్ని నీటిని కలిపి దూదితో మాడు మీద రాయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల క్రమంగా చుండ్రు సమస్య తగ్గుతుంది.

ఒక కప్పు మెంతులను రాత్రిపూట నానబెట్టి ఉదయం కొంచెం పుల్లటి పెరుగు కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పెరుగు కలిపిన మెంతి పేస్ట్ ను తలకు పట్టించి ఒక గంట తర్వాత శుభ్రంగా కడిగి స్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతూ ముఖం పట్టిన కాకుండా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

బయట వాతావరణ కాలుష్యం వల్ల తల మీద దుమ్ము ధూళి పేరుకొని వస్తుంది. అందువల్ల ఇంటి రండి బయటకు వెళ్ళినప్పుడు తలను స్కార్ఫ్ తో కప్పి ఉంచాలి. రెండు రోజులకు ఒకసారి నూనె అంటించి తల స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల చుండ్రు రాకుండా ఉంటుంది.