గొంతు నొప్పి సమస్యతో బాధపడుతున్నారా.. ఈ ఇంటి చిట్కాలు మీ కోసమే?

శీతాకాలం వచ్చిందంటే చాలు.. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి సీజనల్ వ్యాధులు శర వేగంగా వ్యాప్తి చెందుతాయి. జలుబు దగ్గు గొంతునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే కరోనా అని చాలా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వింటర్ సీజన్ లో ఇలాంటి అనారోగ్య సమస్యలు సహజంగా వస్తుంటాయి. జలుబు, గొంతు నొప్పిని మీరు ఈ చిన్న చిట్కాలు వాడి తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నీరు, అల్లం, తేనె లాంటి పదార్థాలు ఉంటే చాలు మీ గొంతునొప్పికి త్వరిత ఉపశమనం లబిస్తుంది. అల్లం
తేనెను కలిపి జ్యూస్ లాగా చేసుకొని తాగితే చాలు మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొంచెం అల్లం చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక పాత్రలో వేసి బాగా మరిగించి తర్వాత వడబోయాలి. ఆ జ్యూస్ లో ఒకటి లేదా 2 స్పూన్లు తేనె కలిపి తాగాలి. అవసరం ఇతే దీన్ని గొంతులో వేసి పుక్కలించాలి, ఇలా చేస్తే మీరు గొంతునొప్పి నుండి ఉపశమనం పొందుతారు.

గొంతు నొప్పికి టీ చాలా బాగా పనిచేస్తుంది. అల్లం తులసి టీ, నిమ్మకాయ తేనే కలిపిన వేడి నీళ్లు, దాల్చిన చెక్క టీ వంటి పానీయాలు మీ గొంతుకి త్వరిత ఉపశమనం కలగజేస్తాయి. కొంచెం తేనె తినడం లేదా తేనెను పాలలో కలుపుకుని తాగడం త్వరగా ఉపశమనం పొందవచ్చు .

మెంతులలో మన ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషక విలువలు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మెంతులు మన ఆరోగ్యానికి చాలా మేలు కలగజేస్తాయి. గొంతు నొప్పి ఉన్నవారు మెంతులు వేసి టీ చేసుకొని తాగడం వల్ల చాలా ఉపశమనం పొందుతారు.మెంతులు ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు కూడా చాలా బాగా దోహదపడతాయి. ఈ చిట్కాలను పాటించి మీ గొంతును నొప్పి నుండి మిమ్మల్ని మీరు సంరక్షించుకోవచ్చు.