బుల్లితెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ షో కి గత కొన్ని సంవత్సరాలుగా యాంకర్ గా వ్యవహరిస్తూ తన అందంతో, ముద్దు ముద్దు మాటలతో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ షోలో రష్మి చేసే యాంకరింగ్ కన్నా సుధీర్ తో కలిసి చేసే రొమాంటిక్ స్కిట్ ల వల్ల మరింత పాపులర్ అయ్యింది. సుధీర్, రష్మి మద్య గత కొన్ని సంవత్సరాలుగా లవ్ ట్రాక్ నడుస్తోంది. స్టేజి మీద వీరిద్దరు డ్యూయట్లు పాడుతూ రచ్చ చేశారు. అంతేకాకుండ ఎన్నో సార్లు ఇద్దరు పెళ్ళి కూడా చేసుకున్నారు. కానీ ఇదంతా కేవలం జబర్ధస్త్ రేటింగ్స్ కోసం మాత్రమే.
అయితే వీరి అభిమానులు మాత్రం వీరిద్దరు నిజజీవితం లో కూడా ఇలా కలిసి ఉంటే చాలా బాగుంటుందని ఆశ పడుతున్నారు. ఇదిలా ఉండగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్ కలిసి జబర్దస్త్ లో తమ స్కిట్ లతో చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే వరుస సినిమా అవకాశాలు రావడంతో మొదట గెటప్ శ్రీను జబర్దస్త్ లో కనిపించకుండా పోయాడు. గత మూడు, నాలుగు వారాలుగా సుడిగాలి సుధీర్ కూడా జబర్దస్త్ లో కనిపించడం లేదు. అందుకు కారణం సుధీర్ కి కూడా సినీమా అవకాశాలు ఎక్కువ రావటం అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అభి, ఆది, సుధీర్ వంటి వారు జబర్దస్త్ నుండి బయటకు రావడంతో ఆ షో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.
ప్రస్తుతం సుధీర్ టీమ్ లో రాంప్రసాద్ మాత్రమే తన స్కిట్లతో జబర్ధస్త్ లో సందడి చేస్తున్నాడు. ఇటీవల రష్మి కూడా స్కిట్ చేసింది. స్కిట్ లో భాగంగా రష్మి సుధీర్ కోసం రోడ్డెక్కి ధర్నా చేసింది. ఈ క్రమంలో ఇమ్మాన్యుయెల్ రష్మి మీద పంచులు వేసాడు. రష్మి ఇలా స్కిట్ లో భాగంగా సుధీర్ కోసం ధర్నా చేస్తే కొంత మంది నెటిజన్స్ మాత్రం ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఇలా సుధీర్ వదిలి వెళ్ళిపోవటం న్యాయం కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రేక్షకులని నవ్వించటానికి స్కిట్ చేస్తే ఏకంగా సుధీర్, రష్మి జీవితాలకి ముడి పెడుతున్నారు.