ఓటిటి : అప్పుడే డిజిటల్ రిలీజ్ కి రెడీ అయ్యిన “ఓరి దేవుడా”

టాలీవుడ్ యూత్ లో ఉన్న లేటెస్ట్ మాస్ హీరోస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో విశ్వక్ సేన్ కూడా ఒకడు. మరి విశ్వక్ అయితే ఒకో సినిమాతో డిఫరెంట్ కాన్సెప్ట్ లు చేస్తూ ఉండగా లేటెస్ట్ గా చేసిన చిత్రమే “ఓరి దేవుడా”. సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అయితే తమిళ దర్శకుడు అస్వత్ తెరకెక్కించాడు.

మరి మొదటగా తమిళ్ లో ఓ మై కడువలె గా తెరకెక్కి హిట్ అయ్యిన ఈ చిత్రాన్ని మేకర్స్ తెలుగులో రీమేక్ చేసి తీశారు. మరి ఈ దీపావళి సందర్భంగా రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మంచి హిట్ కాగా ఇప్పుడు సడెన్ గా డిజిటల్ రిలీజ్ కి రెడీ అయ్యిపోయినట్టు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహా వారు అనౌన్స్ చేశారు.

మరి ఈ చిత్రం ఈరోజే అర్ధ రాత్రి 12 గంటలు నుంచే ఆహా లో అందుబాటులో ఉండనున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. దీనితో ఈ అనౌన్సమెంట్ ఓ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో మిథిలా పల్కర్ హీరోయిన్ గా నటించగా ఆశా భట్ మరో హీరోయిన్ గా నటించింది.