లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బంది పడుతోన్న సంగతి తెలిసిందే. నేటితో మూడవ దశలాక్ డౌన్ ముగుస్తోంది. అయినా లాక్ డౌన్ పొడిగింపు ఉంటుందని ఊహాగానాలొస్తున్నాయి. నేటి నుంచి మే 31 వరకూ నాల్గవ దశ లాక్ డౌన్ ఉంటుందని తెలుస్తోంది. ఇక తెలంగాణ లో ఈ నెల 29 వరకూ లాక్ డౌన్ ని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే పొడిగించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం లాక్ డౌన్ పొడిగించినా..పొడిగించకపోయినా సంబంధం లేదు. అయితే ఇప్పటికే కేసీఆర్ కొన్ని సండలింపులిచ్చారు. మద్యం షాపులు ఓపెన్ చేసి మందుబాబులను ఖుషీ చేసాడు.
తాజాగా కడుపుకాలిన ఓ వ్యక్తి సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. మండుటెండలో పెట్రోలు పోసుకుని అంటించుకోవడానికి యత్నించాడు.దీంతో రక్షణ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతన్ని అడ్డుకున్నారు. చంచలగూడకు చెందిన నజరుద్దీన్ చెప్పులషాపు నడుపుతున్నాడు. రెండు సంవత్సరాలు నష్టాలు భరిస్తూ వ్యాపారం చేస్తున్నాడు. అయితే లాక్ డౌన్ కారణంగా మరింత నష్టాలు కూరుకుపోయాడు.
ఆ బాధను తట్టుకోలేక మనస్థాపానికి గురై ఆత్మహత్యకి యత్నించినట్లు తెలిపాడు. నాలుగు లక్షలు అప్పు ఉందని…ఇప్పుడా ఆ అప్పు కేసీఆర్ తీరుస్తాడా? అని ఆవేదన చెందాడు. దారిని పోయేవాళ్లకి…కొంత మంది పేదవారిని ఆదుకున్న కేసీఆర్ తనని కూడా ఆ రకంగా ఆదుకోవాలని కోరాడు. ప్రజల సమస్యలను కేసీఆర్ కంటితో చూస్తే గానీ పట్టవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఘటనకు సంబంధించి పోలీసులు అతనిపై కేసు నమోదు చేసారు.