పండగ కోసం ప్రగతి పాట్లు.. మాస్ స్టెప్పులతో అడగొట్టిందిగా..?

టాలివుడ్ ఇండస్ట్రీ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో తల్లి అక్క వదిన అత్త వంటి పంటలలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రగతి కొంతకాలంగా బుల్లితెర మీద కూడా సందడి చేస్తోంది. సీరియల్స్ లో నటించడమే కాకుండా శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో సందడి చేస్తోంది. ఇక ఇటీవల మల్లెమాల వారు నిర్వహించిన ఒక స్పెషల్ ఈవెంట్ లో కూడా రచ్చ చేసింది. సాధారణంగా ఏవైనా పండుగలు వస్తే చాలు టీవీ చానల్స్ వారు స్పెషల్ ఈవెంట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటు ఉంటారు. ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ చేయడంలో మల్లెమాలవారు ఒక అడుగు ముందుంటారు.

వినాయక చవితి సందర్భంగా మల్లెమాలవారు మన ఊరి దేవుడు అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులతో పాటు కుష్బూ, ఇంద్రజ, జయసుధ, అన్నపూర్ణమ్మ, ప్రగతి వంటి సీనియర్ నటీమణులు కూడా సందడి చేశారు. అంతేకాకుండా కృష్ణ భగవాన్, నాగినీడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమాలలో చీర కట్టుతో సాంప్రదాయంగా కనిపించే ప్రగతి బయట మాత్రం ఎంతో గ్లామరస్ గా కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంది ప్రగతి తన వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక ఈవెంట్ లో పాల్గొన్న ప్రగతి తన డాన్స్ తో అందరిని మైమరిపించింది. ఈ వయసులో కూడా ప్రగతి అదిరిపోయే మాస్ స్టెప్పులు వేసి అందరిని బాగా ఆకట్టుకుంది. ప్రగతి వేసిన డాన్స్ చూసి అక్కడున్న వారందరూ లీలలు వేస్తూ రచ్చ చేశారు. మొత్తానికి వినాయక చవితి పండుగ కోసం ప్రగతి ఎంతో కష్టపడి డాన్స్ చేసింది. ఇక ఈ ఈవెంట్ కోసం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు కూడా ఎన్నో సాహసాలు చేశారు. చేతుల మీద కార్లు ఎక్కించుకున్నారు. బురదలో కబడ్డీ ఆట ఆడారు. ఇక ఆది, ఇమాన్యుల్, వర్ష ఒకరినొకరు ట్యూబ్ లైట్ లతో కొట్టుకున్నారు. మొత్తానికి వినాయక చవితి కోసం మల్లెమాలవారు అందరి చేత సాహసాలు చేయించారు.