హీరోయిన్ రెజీనా నా కూతురు.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి ప్రగతి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో అమ్మ, అత్త, అక్క, చెల్లి వంటి పాత్రలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇలా సినిమాలలో తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో ప్రగతి షేర్ చేసే డాన్స్ వీడియోలు, వర్కౌట్ వీడియోలు నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వయసులో కూడా ప్రగతి జిమ్ లో కష్టతరమైన వర్కౌట్లు చేస్తూ కుర్రాళ్లకు ఊపిరాడకుండా చేస్తోంది.

అయితే ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి హీరోయిన్ రెజీనా కసాండ్రా తన కూతురు అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు రెజీనాకి ప్రగతి ఎలా తల్లి అవుతుంది అంటూ నేటిజన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి ప్రగతి మాట్లాడుతూ సాయి ధరంతేజ్ రెజీనా జంటగా నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో ప్రగతి రెజీనాకి తల్లిగా నటించింది. అప్పటినుండి రెజినా తనని అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ ఉంది.

ఇప్పటికీ కూడా రెజీనా ప్రగతిని అమ్మ అనే పిలుస్తుంది. దీంతో ప్రగతి కూడా రెజీనా నీ తన సొంత కూతురిలా భావిస్తోంది. అందువల్ల రెజీనా నా కూతురు అని ప్రగతి చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ప్రగతి సినిమాలలో నటిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా టీవీ షోలలో కూడా సందడి చేస్తోంది. బుల్లితెర మీద ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ప్రగతి తన పంచులతోపాటు అదిరిపోయే డాన్స్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.