Ukraine: రష్యా,ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఆ యుద్ధం నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి తాజాగా భారతీయ విద్యార్థులు చక్కటి ప్లాన్ చేశారు. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయ విద్యార్థులు దేశాన్ని వీడాలి అంటే భారతీయ మువ్వన్నెల జెండా ఉండాలి. ఆ జెండా గా ఉంటేనే వారు దేశాన్ని క్షేమంగా వీడే అవకాశం ఉంటుంది. లేదంటే రష్యా వారు భారతీయ విద్యార్థులను కూడా ఒక ఉక్రెయిన్ పౌరులుగా భావించి వారిపై అటాక్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉక్రెయిన్ ను వీడి సరిహద్దులకు చేరుకోవాలనుకునే భారతీయ విద్యార్థులు భారత జెండా ని పట్టుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
అయితే ఉక్రెయిన్ దేశం లో భారతీయ జెండా దొరకదు కాబట్టి, భారత విద్యార్థులు అక్కడి మార్కెట్ కు వెళ్లి జాతీయ పతాకం లోని మూడు రంగుల స్ప్రే లను కొనుగోలు చేసి ఆపై వాటిని వస్త్రంపై స్ప్రే చేసి జెండాను రూపొందించారు. ఆ మువ్వన్నెల జెండాను పట్టుకుని ఉక్రెయిన్ నుంచి సరిహద్దులకు సురక్షితంగా చేరుకోగలిగారు. ఉక్రెయిన్ నుంచి ఒడిస్సా నుంచి బుకారెస్ట్ చేరుకున్న ఒక విద్యార్థి ఈ విషయాన్ని తెలిపాడు. అంతేకాకుండా ఉక్రెయిన్ లో చిక్కుకున్న టర్కీ, పాకిస్తాన్ విద్యార్థులు కూడా మన భారతీయ జెండా మాటునే దాగి ఉండటం గమనార్హం.