Suicide: ఆన్లైన్ గేమ్స్ కి బానిసైన విద్యార్థి.. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య…!

Suicide: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగాలు మాత్రమే కాకుండా దానికి మించిన దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.ప్రస్తుత కాలంలో స్కూలుకు వెళ్ళే చిన్న పిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు ఫోన్ లో వాడకం బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఎంతోమంది మొబైల్ఫోన్ చూడటానికి బాగానే ఉంటాయి ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా చాలా మంది యువత ఆన్లైన్ గేమ్స్ కి బాగా అలవాటుపడి వాటికి బానిస అవుతున్నారు.

మనదేశంలో పబ్ జీ వంటి ఆన్లైన్ గేమ్స్ కి యువత బాగా అలవాటుపడి దానికి బానిస లా మారారు. అందువల్ల చాలా మంది యువత మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరికొంతమంది మాత్రం ఈ ఆన్లైన్ గేమ్స్ కి బానిసై ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కి చెందినట్ యువకుడు ఆన్ లైన్ ఆటలకు బానిసై ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన జితేంద్ర వసాకల్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కంప్యూటర్ అప్లికేషన్స్​లో పోస్ట్ గ్యాడ్యూయేట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమ్స్ కు అలవాటు పడి వాటికి బానిసగా మారాడు. ఆన్ లైన్ ఆటల కోసం అధిక మొత్తంలో అప్పులు చేశాడు. అప్పులు ఎక్కువవడం, అప్పు ఇచ్చిన వారు తిరిగి డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేయడం వల్ల వాటిని ఎలా తీర్చాలో తేలిక మానసిక ఒత్తిడికి గురయ్యాడు.అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఎవరూ లేని సమయంలో ఇంద్రపురి హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడి జేబులో సూసైడ్ లెటర్ లభించింది. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో రాశాడు.