టాలీవుడ్ ఇండస్ట్రీలో అదృష్టం కలిసి రాని హీరోల్లో అల్లు శిరీష్ కూడా ఒకరిని చెప్పొచ్చు. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ కొట్టి సత్తా నిరూపించుకోలేకపోతున్నాడు. గౌరవం సినిమాతో అల్లు శిరీష్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదటి సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికీ తరువాత మారుతి దర్శకత్వంలో వచ్చిన కొత్తజంట సినిమా కూడా మోస్తారు విజయాన్ని అందించి నిరాశపరిచింది. తర్వాత వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులు ఆదరించకపోవడంతో అల్లు శిరీష్ ఖాతాలో ఒక్క బ్లాక్ బాస్టర్ మూవీ కూడా చేరలేదని చెప్పొచ్చు.
తాజాగా అల్లు శిరీష్,అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ లవ్ స్టోరీ ఊర్వశివో రాక్షసివో ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది అంటూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తూ థియేటర్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సినిమాకు విజేత మూవీ దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అల్లు శిరీష్ కెరీర్ కు ఎటువంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి మరి.ఇదిలా ఉండగా అల్లు శిరీష్ ఆలీతో సరదాగా షోలో కొన్ని ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
అల్లు శిరీష్ మూడేళ్ల వయసులోనే చిరంజీవి హీరోగా హిందీలో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ప్రతిబంధ్ అనే సినిమాలో విద్యార్థి పాత్రలో నటించానని ఈ కార్యక్రమంలో వెల్లడించారు. అలాగే దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన మాయాబజార్ సినిమాలో బాల నటుడిగా నటించిన విషయం చెప్పారు.హిందీ గజిని సినిమాలో అమీర్ ఖాన్ తో కలిసి నటించిన విషయాన్ని ప్రస్తావించారు. చిరంజీవి గారి అన్ని సినిమాలు లెక్కలేనన్నిసార్లు చూశానని అందులో జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, బావగారు బాగున్నారా, ఇంద్ర వంటి చాలా సినిమాలు తనకు ఎంతో నచ్చాయని చెప్పారు.