హెల్మెట్ పెట్టుకోలేదని విద్యార్థితో అసభ్యంగా ప్రవర్తించిన ట్రాఫిక్ పోలీస్… ట్విస్ట్ ఏమిటంటే..?

పోలీస్ ఉద్యోగం అనేది చాలా బాధ్యతతో కూడుకున్నది. అందువల్ల సమాజంలో ఉన్న ప్రజలందరూ కూడా పోలీస్ ఉద్యోగం చేస్తున్న వారిని ఎంతో గౌరవిస్తూ ఉంటారు. తప్పు చేసిన వారిని శిక్షించే హక్కు తల్లిదండ్రుల తర్వాత కేవలం పోలీసులకు మాత్రమే ఉంటుంది. అటువంటి గౌరవమైన వృత్తిలో ఉంటూ కొంతమంది తమ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకొని అన్యాయాలు, అరాచకాలకు పాల్పడుతున్నారు. కానిస్టేబుల్ దగ్గర నుండి పై అధికారుల వరకు అక్కడక్కడ ఇలాంటి నీచులు డిపార్ట్మెంట్లో ఉన్నారు. దీనికి నిదర్శనగా ఇటీవల హెల్మెట్ పెట్టుకోలేదని ఒక విద్యార్థిని పట్ల ట్రాఫిక్ పోలీస్ అసభ్యంగా ప్రవర్తించిన తీరు తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే… రాజస్థాన్‌, కోటా పరిధిలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చదువుతున్న యువతి శనివారం ఉదయం స్కూటీపై కాలేజీకి వెళుతున్న సమయంలో.. ఆ క్యాడ్‌ సర్కిల్‌ వద్ద విధుల్లో ఉన్న కైలాష్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ యువతి వాహనాన్ని ఆపాడు. ఆమె హెల్మెట్ ధరించకపోవడంతో ఎందుకు హెల్మెట్‌ ధరించలేదంటూ ప్రశ్నించాడు. ఆ తర్వాత బైకును పక్కకి తీసుకెళ్లిన నీకు పెళ్లి అయ్యిందా అంటూ వ్యక్తిగత విషయాలు అడగటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తనతో స్నేహం చేయాలని అడిగాడు. అంతే కాకుండా ఇంటి వద్ద భార్య, పిల్లలు లేరని, తన వెంట వస్తే మొబైల్ ఫోన్‌ కూడా గిఫ్ట్‌గా ఇస్తానని ఆ యువతి తో అసభ్యంగా pravarthinchaadu. అంతటితో ఆగకుండా తాను చెప్పినట్టు వినకపోతే రూ.10,000 ఫైన్ విధిస్తానని ఆ యువతిని బెదిరించాడు.

ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రవర్తన పట్ల భయం చెందిన యువతి మళ్లీ కలుస్తానని చెప్పి మెల్లగా అక్కడి నుండి జారుకుని నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద ఫిర్యాదు చేసింది. వాహనదారులు నిబంధనలను అతిక్రమిస్తే ఫైన్ వేయకుండా ఇలా అసభ్యంగా ప్రవర్తించటంతో ఆ యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవటంతో పై అధికారులు కూడా సదరు ట్రాఫిక్ కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. కోరిక తీర్చకపోతే పదివేల రూపాయలు ఫైన్ వేస్తానన్న ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ ని విధుల నుండి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.