దేశంలో కనీసం సింగిల్ డోస్ అయినా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు 25 శాతానికి చేరుకున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కాస్త వేగంగానే జరుగుతోందిగానీ, ఇంకా వేగంగా జరగాల్సి వుంది. చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం తగ్గుతోందంటే, దానిక్కారణం వ్యాక్సిన్ తగినంతగా లభ్యం కాకపోవడమే.
ఆ సంగతి పక్కన పెడితే, వ్యాక్సిన్ వేసుకున్నాక కూడా కరోనా వైరస సోకుతుందా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్, కరోనా నుంచి పూర్తి రక్షణ ఇవ్వదనే వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంత మేర ఉపశమనం మాత్రమే వ్యాక్సినేషన్ కల్పిస్తుందట. అమెరికాలో మళ్ళీ అనూహ్యంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
నిజానికి, అక్కడ రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది, జరుగుతూనే వుంది. మరెలా కేసులు పెరుగుతున్నాయట.? కరోనా వైరస్ చాలా చాలా చిత్రంగా ప్రవర్తిస్తోంది. వేవ్స్ వారీగా విరుచుకుపడుతోంది. రెండో వేవ్ భారతదేశంలో తగ్గుముఖం పట్టిన మాట వాస్తవం. కానీ, మూడో వేవ్ భయాలు ఇంకా అలాగే వున్నాయి.
వ్యాక్సిన్ పొందినవారిలో చాలా తక్కువ శాతం మంది మాత్రమే ఆసుపత్రికి వెళ్ళాల్సి రావొచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, వ్యాక్సిన్ పొందకనున్నా, కరోనా సోకిన కొందరికి ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం రావడంలేదన్న వాస్తవాన్ని మనం గుర్తించాల్సిందే. వ్యాక్సినేషన్ చుట్టూ ఇంత గందరగోళం సమాజానికి అస్సలేమాత్రం మంచిది కాదు. వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వస్తుందన్నప్పుడు, వ్యాక్సిన్ వేసుకోవడమెందుకు.? అన్న ప్రశ్న కారణంగానే చాలామంది వ్యాక్సినేషన్‌కి దూరంగా వుంటున్నారు.