మీరు ఎస్బీఐ కస్టమరా? అదేనండి.. స్టేట్ బ్యాంక్ ఇండియాలో మీకు అకౌంట్ ఉందా? అయితే ఈ వార్త ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు. ఎస్బీఐ తన కస్టమర్లను తాజాగా హెచ్చరించింది. ఎందుకో మీరే తెలుసుకోండి..
ప్రస్తుతం ప్రపంచమంతా ఫేస్ చేస్తున్న విషయం సైబర్ క్రైమ్. బ్యాంకు కస్టమర్లందరూ అప్రమత్తంగా లేకపోతే.. బ్యాంకులోని డబ్బు ఉన్నది ఉన్నట్టే మాయమైపోతోంది. దాన్నే సైబర్ క్రైమ్ అంటారు.
అయితే.. దీనిపై అవగాహన లేకపోతే బ్యాంకులో ఉండే డబ్బుకు గ్యారెంటీ ఉండదు. సైబర్ నేరగాళ్ల చేతిలో కస్టమర్ల అకౌంట్ల వివరాలు పడ్డాయా? ఇక అంతే.. ఎవ్వరూ ఏం చేయలేరు. ప్రపంచంలో ఎక్కడో ఉండి మీ అకౌంట్ లోని డబ్బులను లాగేసుకుంటారు.
అందుకే.. ఎస్బీఐ ముందుగానే తన కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. సైబర్ నేరగాళ్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించింది. మెయిల్ కు ఏవైనా మోసపూరిత ఈమెయిల్స్ వస్తే వాటిని ఓపెన్ చేయొద్దని.. అవి ఫిషింగ్ మెయిల్స్ అని హెచ్చరించింది.
గత కొన్ని రోజుల నుంచి ఎస్బీఐ పేరుతో.. ఎస్బీఐ లోగోతో కస్టమర్లకు మెయిల్స్ వెళ్తున్నాయి. నిజానికి ఆ మెయిల్స్ బ్యాంకు పంపించింది కాదు. అదంతా సైబర్ నేరగాళ్ల పని. అవి ఫేక్ ఈమెయిల్స్. అలాంటి మెయిల్స్ వచ్చినప్పుడు వాటిపై క్లిక్ చేస్తే అంతే.. కస్టమర్ల డేటా సైబర్ క్రిమినల్స్ కు చిక్కినట్టే.. బ్యాంకు నుంచి అటువంటి మెయిల్స్ కస్టమర్లకు వెళ్లవు.. ఫేక్ ఈమెయిల్స్ విషయంలో కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలి.. అంటూ ఎస్బీఐ వెల్లడించింది.
ఫేక్ ఈమెయిల్స్ ను సైబర్ నేరగాళ్లు ఎలా కస్టమర్లకు పంపిస్తారో దాని ఫార్మాట్ ను కూడా ఎస్బీఐ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. అందుకే.. ఎస్బీఐ కస్టమర్లు తమకు వచ్చే ఈమెయిల్స్ పట్ల కాస్త జాగ్రత్తగా ఉండటం మంచింది. ఒకవేళ అటువంటి ఈమెయిల్స్ వస్తే.. వెంటనే సంబంధిత బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదిస్తే బెటర్.
What to know: Fraudsters are sending emails that appear to be from #SBI.
What to do: Report such scam emails to – https://t.co/6ovJsbzVJc
Our Internet Banking link – https://t.co/7JnKEKE7zP
Think Before You Click.#INB #StateBankOfIndia #SafeBanking #SecurityTips #OnlineSBI pic.twitter.com/MSOXdOnpyt
— State Bank of India (@TheOfficialSBI) September 24, 2020