స్టార్ హీరో ప్రభాస్ కు ఇష్టమైన వంటకాలు ఇవే.. నోరూరిపోయేలా?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు సినిమాసినిమాకు ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ప్రభాస్ ఫ్లాప్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలైన సలార్, ప్రాజెక్ట్ కె లతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో ఆయనకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఫ్యాన్స్ సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు.

ప్రభాస్ పెద్దమ్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ పులసను ఎంతో ఇష్టంగా తింటారని చెప్పుకొచ్చారు. నాన్ వెజ్ వంటకాలను సైతం ప్రభాస్ ఇష్టంగా తింటారని సమాచారం. ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతుందంటే సెట్ లో హీరోయిన్లు, దర్శకుడితో పాటు ఇతర టెక్నీషియన్లకు కూడా కచ్చితంగా భోజనాలు అందుతాయనే సంగతి తెలిసిందే. ప్రభాస్ పంపించే ఆహారాన్ని ప్రశంసిస్తూ చాలామంది చాలామంది హీరోయిన్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

ప్రభాస్ భోజన ప్రియుడు కాగా డైట్ విషయంలో షూటింగ్ లు లేని సమయంలో పెద్దగా నియమనిబంధనలు పాటించరని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ ఈ నెల 24వ తేదీ నుంచి సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రభాస్ తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ స్టార్ హీరో పారితోషికం కూడా భారీగానే ఉండటం గమనార్హం.

ప్రభాస్ కు తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాల్సి ఉంది. ప్రభాస్ గత సినిమాల ఫలితాల నేపథ్యంలో ఇకపై స్టార్ డైరెక్టర్లకు మాత్రమే అవకాశాలను ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. రోజురోజుకు ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.