టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన కొరటాల శివ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను తెరకెక్కిస్తూ దర్శకునిగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మిర్చి సినిమాతో దర్శకునిగా కొరటాల శివ కెరీర్ మొదలైంది. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ తో కొరటాల శివ సత్తా చాటారు. ప్రభాస్ ను కొరటాల శివ కొత్తగా చూపించడంతో పాటు ఈ సినిమాలో కొరటాల శివ ఇచ్చిన మెసేజ్ సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఆ తర్వాత రెండో సినిమా మహేష్ హీరోగా శ్రీమంతుడు పేరుతో తెరకెక్కగా ఈ సినిమా సమాజంలో మార్పుకు కారణమైందనే సంగతి తెలిసిందే. మహేష్ సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా శ్రీమంతుడినని చెబుతూ పలు గ్రామాలను దత్తత తీసుకున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించి మహేష్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే.
మూడో సినిమాగా కొరటాల శివ డైరెక్షన్ లో జనతా గ్యారేజ్ తెరకెక్కగా నెగిటివ్ రివ్యూలతో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. మహేష్ బాబుతో రెండో సినిమా తీస్తే దర్శకునికి తొలి సినిమాను మించిన హిట్ దక్కదని ఇండస్ట్రీలో పేరుంది. అయితే భరత్ అనే నేను సినిమాతో కొరటాల శివ ఆ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయం సాధించింది.
ఆచార్య తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే కొరటాల శివ సినిమాల ద్వారా 60 కోట్లరూపాయల నుంచి 70 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని తెలుస్తోంది. ఈ స్థాయిలో ఆస్తులను సంపాదించిన దర్శకులలో కొరటాల శివ ఒకరు కావడం గమనార్హం. కొరటాల శివ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.