‎Pawan Kalyan: హమ్మయ్యా.. చాలా రోజులకు కలర్ ఫుల్ గా కనిపించిన పవన్.. ఫోటోస్ వైరల్!

Pawan Kalyan: టాలీవుడ్ హీరో, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మనందరికీ తెలిసిందే. పవన్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలో మరొకవైపు యాక్టివ్ గా పాల్గొంటూ ఫుల్ బిజీబిజీగా ఉన్నారు. అయితే మొన్నటి వరకు రాజకీయాలలో డిప్యూటీ సీఎం గా ఫుల్ బిజీబిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగానే ఇటీవల హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే.

‎ ప్రస్తుతం భగవద్వీడు భగత్ సింగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కాగా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రేపు అనగా జూలై 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీబిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇది ఇలా ఉంటే రాజకీయాలలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఎక్కడ కనిపించినా కూడా పవన్ కళ్యాణ్ కేవలం వైట్ షర్టు వైట్ ప్లాంట్లోనే కనిపించేవారు.

‎ఇంట్లోని ఫంక్షన్లో ఏదైనా ఈవెంట్లకు వెళ్లినా కూడా వైట్ అండ్ వైట్ లోనే ఎక్కువగా కనిపించాడు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్ కలర్ ఫుల్ గా కనిపించి చాలా రోజులు అయింది. అయితే రోజూ వైట్ అండ్ వైట్ రాజకీయాల్లో కనిపించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో ఇలా కలర్ ఫుల్ గా కనిపించి ఫ్యాన్స్ లో జోష్ నింపారు. తాజాగా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.