‎Nivetha Pethuraj: కాబోయే భర్తను చేసిన నివేతా పేతురాజ్.. వరుడు ఎవరో తెలుసా?

‎Nivetha Pethuraj: నివేతా పేతురాజ్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అయితే ఆమె నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడపాదడపా సినిమాలలో నటిస్తోంది.

‎ఇది ఇలా ఉంటే తాజాగా ముద్దుగుమ్మ అభిమానులకు ఒక చక్కటి శుభవార్తను తెలిపింది. అదేమిటంటే త్వరలోనే తాను వివాహం చేసుకోబోతున్నట్లు తెలిపింది. అయితే ఇదే విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో తనకు కాబోయే భర్తను పరిచయం చేసేసింది. కాగా ఈ జంటకు ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిపోయిందట.

‎ఇకపోతే నివేదకు కాబోయే భర్త పేరు రాజ్‌హిత్ ఇబ్రాన్‌. అతను దుబాయ్‌ లో బిజినెస్‌ మ్యాన్‌ అని తెలుస్తోంది. కొంతకాలంగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. ఏకంగా ఎంగేజ్‌మెంట్‌ తర్వాత అందరికీ శుభవార్త తెలిపారు. ఇదే ఏడాదిలో వారి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నివదా విషయానికి వస్తే.. తమిళనాడుకు చెందిన నివేతా పేతురాజ్ 2016లో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదే మెంటల్ మదిలో అనే చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురములో, రెడ్, పాగల్, విరాటపర్వం లాంటి చాలా సినిమాలలో నటించి మెప్పించింది.