Kiara Advani: టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులతో పాన్ ఇండియా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా వార్ 2. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు అంచనాలను భారీగా పెంచేసాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని అప్డేట్లను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఎన్టీఆర్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ వార్ 2 మూవీకి సంబందించిన అప్డేట్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.
అదేమిటంటే వార్ 2 సినిమా షూటింగ్ లో తీసుకున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో హీరో హృతిక్ రోషన్ తో కలిసి కారులో బైక్ లో ప్రయాణిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.

