అందాల భామ శృతిహాసన్‌లో దాగి ఉన్న మల్టీ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటిగానే కాకుండా సింగర్‌గా, రచయితగా, దర్శకురాలిగా కూడా ప్రేక్షకులని థ్రిల్ చేయనుంది. గబ్బర్ సింగ్ చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చిన శృతి హాసన్ ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ భాషలలో పలు చిత్రాలు చేసింది. ఇవి మంచి విజయం సాధించడంతో శృతి రేంజ్ ఎక్కడికో ఎదిగిపోయింది. అయితే కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో మైఖేల్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డ ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రెండేళ్ళ పాటు సినిమాలు చేయడమే మానేసింది.
మైఖేల్‌తో కలిసి చెట్టాపట్టాలు వేయడం, విహారయాత్రలకు వెళ్లడం అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరచింది. అయితే అతనితో ఎప్పుడైతే బ్రేకప్ అయిందో మళ్ళీ సినిమాలు చేయడం మొదలు పెట్టింది. తమిళంలో విజయ్ సేతుపతి సరసన లాభం, రవితేజ సరసన క్రాక్, పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్, ప్రభాస్ సరసన సలార్ సినిమాలు చేసేందుకు సైన్ చేసింది. శృతి నటించిన క్రాక్ చిత్రం ఇప్పటికే విడుదల కాగా, ఈ మూవీ మంచి విజయం సాధించింది. వకీల్ సాబ్ రిలీజ్‌కు సిద్దంగా ఉంది.
ప్రస్తుతం సలార్ చిత్రంతో బిజీగా ఉంది శృతి హాసన్. ఈ మూవీని కన్నడ దర్శకుడు ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే నాలుగేళ్ళ క్రితం కన్నడ సినిమాలు చేయను అంటూ ట్వీట్ చేసిన శృతి ఇప్పుడు కన్నడ దర్శకుడితో ఎలా సినిమా చేస్తుంది అంటూ కన్నడీగులు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. . గతంలో నచ్చని కన్నడ సినిమా పరిశ్రమ ఇప్పుడు ఎలా పనికి వచ్చినందని విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన శృతి.. కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చినా కూడా డేట్లు కుదరక నటించలేక పోయాను. కన్నడ పరిశ్రమ అంటే నాకు చిన్న చూపు లేదు. న్ని భాషల సినిమా పరిశ్రమలు మరియు అన్ని భాషలకు చెందిన నటీ నటులు మరియు టెక్నీషియన్స్ అంటే నాకు అమితమైన గౌరవం ఉందని చెప్పింది .