ఆ యంగ్ హీరో తో శ్రీను వైట్ల నెక్స్ట్ సినిమా?

శ్రీను వైట్ల అంటే ఒకప్పుడు ఎక్కడలేని క్రేజ్. ‘నీతో’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీను వైట్ల ‘ఆనందం’ సినిమాతో మొదటి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ ‘ఢీ’ సినిమాలు తో కూడా హిట్స్ ఇచ్చాడు. కానీ ‘రెడీ’ సినిమాతో శ్రీను వైట్ల పేరు మారుమోగిపోయింది.

స్టార్ హీరోలు సైతం శ్రీను తో సినిమా చెయ్యడానికి లైన్ కట్టేవాళ్ళు. ‘కింగ్’, ‘నమో వెంకతెశ’ సినిమాల తర్వాత  ‘దూకుడు’ లాంటి సూపర్ హిట్ తో శ్రీను వైట్ల క్రేజ్ డబల్ అయ్యింది. అయితే ‘బాదుషా’ మూవీ తర్వాత వరుస పరాజయాలతో శ్రీను వైట్ల కెరీర్ డీలా పడిపోయింది. రైటర్ కోన వెంకట్ తో వచ్చిన విభేదాలు కూడా దీనికి ఒక కారణం.

కొన్నాళ్ల క్రితం మంచు విష్ణు తో ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ తీస్తున్నట్టు వార్తలు వచ్చాయి, కానీ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు హీరో రామ్ తో శ్రీనువైట్ల తన తర్వాత సినిమాని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

హీరో రామ్ తో శ్రీనువైట్ల ‘రెడీ’ అనే సినిమా చేసాడు. ఈ హిట్ కాంబినేషన్ కలిసి మరో సినిమా చేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీనువైట్ల, రామ్ కి ఒక కథ చెప్పాడని.. రామ్ కి కథ కూడా బాగా నచ్చిందని.. ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కలయికలో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీని పై డైరెక్టర్, రామ్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.