తొలిప్రేమ అంటూ ఓ రేంజ్ లో రచ్చ చేస్తున్న శ్రీముఖి… వీడియో వైరల్!

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి తెలియనివారంటూ ఉండరు. యాంకర్ గా బుల్లితెర మీద శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతా కాదు. తన అందంతో పాటు చిలిపి అల్లరితో ప్రేక్షకులని బాగా ఆకట్టుకొని బుల్లితెర రాములమ్మగా గుర్తింపు పొందింది. మొదట అదుర్స్ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖి ఆ తర్వాత పటాస్ షో ద్వారా బాగా పాపులర్ అయింది. అప్పటినుండి పలు టీవీ షోస్ కి యాంకరింగ్ చేస్తూ బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో కార్యక్రమాలలో సందడి చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

శ్రీముఖి ఇలా యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా మంచి గుర్తింపు పొందింది. మొదట అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించిన శ్రీముఖి ఆ తర్వాత కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇలా టీవీ షోలు సినిమాలతో బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో శ్రీముఖి తన అందమైన ఫోటోలతో పాటు ఫన్నీ వీడియోస్ కూడా షేర్ చేస్తూ నేటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం శ్రీముఖి విదేశాలలో మన తెలుగు సింగర్స్ తో కలిసి తెగ అల్లరి చేస్తోంది. ఈ ట్రిప్ కి సంబంధించి ఫోటోలు,ఫన్నీ వీడియోలు శ్రీముఖి ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది.ఈ మధ్య శ్రీముఖి పలు కొత్త షోలల్లో కూడా పాల్గొంటోంది. తాజాగా మరో కొత్త షో తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ షో కి సంబంధించిన స్టోరీలను కూడా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో శ్రీముఖి తొలిప్రేమ నవ్వులు జల్లులు అంటూ వీడియో షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోని చూసిన నెటిజన్లు లైక్ లతో పాటువివిధ రకాల కామెంట్లు కూడా పెడుతున్నారు.