సరిగమప కంటెస్టెంట్ తో ప్రేమలో పడిన శ్రీముఖి..?

బుల్లితెర మీద సందడి చేస్తున్న యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. అదుర్స్ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రీముఖి పటాస్ షో ద్వార బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో టీవీ షోస్ కి యాంకరింగ్ చేస్తూ పలు కార్యక్రమాలలో కూడా సందడి చేస్తుంది. శ్రీముఖి యాంకరింగ్ చేస్తుందంటే చాలా ఆ షో మొత్తం సందడిగా ఉంటుంది. శ్రీముఖి తన అందంతో పాటు చిలిపి చేష్టలతో కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. శ్రీముఖి ప్రస్తుతం జాతిరత్నాలు, సరిగమపా షోస్ కి యాంకరింగ్ చేస్తోంది.

శ్రీముఖి ఇలా యాంకర్ గా మాత్రమే కాకుండా.. సినిమాలలో నటిస్తూ సిల్వర్ స్క్రీన్ మీద కూడా సందడి చేస్తోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించిన శ్రీముఖి ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇక ఇలా సినిమాలు, టీవి షోస్ తో బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులుగా శ్రీముఖికి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. ప్రస్తుతం శ్రీముఖి సరిగామప షో కి యాంకరింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో లో పార్టిసిపేట్ చేస్తున్న చరణ్ అనే కంటెస్టెంట్ తో శ్రీముఖి ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.

వీరిద్దరూ స్టేజి మీద కూడా చాలా సరదాగా ఉంటారు. ముఖ్యంగా శ్రీముఖి చాలాసార్లు చరణ్ అంటే ఇష్టమని చెప్పింది. అయితే చరణ్ మాత్రమ్ ఇప్పటివరకు శ్రీముఖి ఇష్టమని చెప్పలేదు. తాజాగా శ్రీముఖి తొలిప్రేమ సినిమాలో కీర్తీ రెడ్డీ ఇంట్రడక్షన్ సీన్ చేసినట్టు చేసింది. ఇది చూసిన తర్వాత చరణ్ కచ్చితంగా పడిపోయే తీరాలి అని అంటుంది. అప్పుడు స్మిత ఈ పాట ఎందుకు పాడానురా బాబు అని పడిపోయి ఉంటాడు అని అంటుంది. ఆ సమయంలో చరణ్ శ్రీముఖి దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసినట్టు కిందకి వంగి షూ లేస్ కట్టుకుని అందరికీ షాకిచ్చారు. దాంతో శ్రీముఖి నాలో అర సెకను పాటు ఆశ రేపావని అంటుంది. అయితే శ్రీముఖి నిజంగా జ్వరంతో ప్రేమలో ఉందా? లేక టీఆర్పి కోసం ఇలా చేస్తుందా? అని ప్రేక్షకుల అనుమానపడుతున్నారు.