Sravana Bhargavi: అపార్థాలతో బ్రతకొద్దు… సంచలనగా మారిన సింగర్ పోస్ట్.. విడాకుల గురించేనా?

Sravana Bhargavi: సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కలిసి జీవించే వారి కంటే కూడా విడాకులు తీసుకొని విడిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది. ఇలా చిన్నచిన్న విషయాలకే అపార్థాలు చేసుకుంటూ ఎంతోమంది విడాకులు తీసుకున్న విడిపోతున్నారు.. గత కొంతకాలంగా సింగర్ శ్రావణ భార్గవి హేమచంద్ర విడాకుల గురించి కూడా ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. వీరిద్దరూ సింగర్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు అందరితో కలిసి పనిచేశారు.

సింగర్లుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న శ్రావణ భార్గవి హేమచంద్ర ప్రేమలో పడి పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు శిఖ చంద్రిక అనే ఒక కుమార్తె కూడా ఉంది. అయితే గతంలో ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున బుల్లితెర కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ సందడి చేసిన వీరు ఇటీవల కాలంలో కలిసి జంటగా కనిపించలేదు. దీంతో వీరిద్దరు విడాకులు తీసుకున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఒకానొక టైంలో ఈ వార్తలను పూర్తిగా ఖండించారు.

ఇకపోతే శ్రావణ భార్గవి హేమచంద్ర ఇటీవల ఎక్కడ కలిసి కనిపించకపోవడం శ్రావణ భార్గవి ఇటీవల తన కుమార్తెతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంతో మరోసారి వీరి విడాకుల గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో కూడా శోభన్ భార్గవి హేమచంద్రకు సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈమె చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది.

తాజాగా శ్రావణ భార్గవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ కలకలం రేపుతోంది. లైఫ్ చాలా సున్నితమైనది.. అవసరాలు, అపార్ధాలు, చిక్కుముళ్లు, వివాదాలు, గొడవలు.. వీటితోనే బతికేయడంలో అర్ధం లేదన్నారు. ప్రేమ మాత్రమే అర్ధవంతమైనది.. మనం ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు ..వారిని ఎక్కువగా ప్రేమించడానికే చూడాలి.. జీవితంలో మనం గెలిచామో? ఓడామో అదే డిసైడ్ చేస్తుందని శ్రావణ భార్గవి రాసుకొచ్చారు. దీంతో ఈమె హేమచంద్రని ఉద్దేశించే ఈ పోస్ట్ చేశారా? ఆయనతో విడాకులు తీసుకున్న విషయాన్ని ఇలా తెలియజేశారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.