సీబీఐ ఆఫీసర్లను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు. ఆవలిస్తేనే పేగులు లెక్కపెట్టే రకం వాళ్లు. అటువంటి వాళ్ల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు పర్ ఫెక్ట్ ట్రెయిన్డ్. వాళ్లనే బురిడి కొట్టిద్దామనుకుంటే కష్టం.
ఇఫ్పుడు సీబీఐ ఆఫీసర్ల గురించి చర్చ ఎందుకంటే.. ఇటీవల గుంటూరులో ఓ కేసు దర్యాప్తు కోసం సీబీఐ ఆఫీసర్లు వచ్చారు. గుంటూరులో దర్యాప్తు చేస్తున్న సమయంలో వాళ్లకు భద్రత ఇవ్వడం కోసం ఓ ఎస్ఐని పోలీసులు పంపించారు.
అంతవరకు బాగానే ఉంది కానీ.. సీబీఐ ఆఫీసర్లు ఓ కేసు విషయమై దర్యాప్తు చేస్తుండగా… అక్కడికి వచ్చిన మహిళా ఎస్ఐ వాళ్లకు రక్షణగా ఉండకుండా.. వాళ్లు చేసే దర్యాప్తును సీక్రెట్ గా తన ఫోన్ లో చిత్రీకరించిందట. ఆమె ఫోన్ లో దర్యాప్తుకు సంబంధించిన విషయాలను రికార్డు చేస్తున్నదని తెలుసుకున్న సీబీఐ అధికారులు వెంటనే తన ఫోన్ ను తీసుకొని చెక్ చేయడంతో మొత్తం బండారం బయటపడింది. అంటే తమపైనే నిఘా పెట్టారు అని తెలుసుకొని సీబీఐ అధికారులు నివ్వెరపోయారు.
వెంటనే ఈ ఘటనపై సీబీఐ అధికారులు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ ఎస్ఐని అక్కడినుంచి పంపించారు. ఐజీకి కూడా త్వరలో ఫిర్యాదు చేస్తామని వాళ్లు తెలిపారు. తమపై నిఘా పెట్టిన విషయాన్ని తమ పై అధికారులకు కూడా వాళ్లు చేరవేశారు.
అయితే.. క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి… ముగ్గురు వ్యక్తులను 2019 అక్టోబర్ లో గుంటూరు సీసీఎస్ పోలీసులు అక్రమంగా నిర్భందించారని ఆరోపణలు వచ్చాయి. దానిపై హైకోర్టులో కేసు కూడా నమోదు అయింది. పోలీసులపైన ఈ ఆరోపణలు రావడంతో… వెంటనే హైకోర్టు ఈకేసును సీబీఐ కి అప్పగించింది. దీనిపై దర్యాప్తు చేయడానికే సీబీఐ అధికారులు గుంటూరు వచ్చి… దర్యాప్తు చేస్తుండగా మహిళా ఎస్ఐ దర్యాప్తును చిత్రీకరించడంతో అసలు విషయం బయటికి వచ్చింది.