Health Tips: దగ్గు, జ్వరం, జలుబుకి దివ్యౌషధంలా పని చేసే పాలకూర..!

Health Tips: శీతాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి సర్వసాధారణం. చిన్న పెద్ద భేదం లేకుండా ఈ సమస్యలు శీతాకాలంలో అందర్ని వేధిస్తుంటాయి. గత రెండు సంవత్సరాల ముందు వరకు సాధారణమైనవే అని ఎవరు కూడా ఎక్కువగా భయపడేవారు కాదు. అయితే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి లక్షణాలు కూడా దాదాపుగా ఇలానే ఉండటంతో సాధారణ జ్వరం వచ్చిన సరే ప్రజలు వణికిపోతున్నారు. అందుకే జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తునే వాటిని తగ్గించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

ఆకుకూరలలో ఆరోగ్యానికి అవసరమైన అనేక రకాల పోషకాలు ఉంటాయి.ముఖ్యంగా పాలకూరలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా పాలకూర ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇది ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. పాలకూర సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. పాలకూరను క్రింది విధంగా తీసుకుంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలు కేవలం మూడు రోజుల్లోనే దూరం చేయవచ్చు.

పాలకూరను ఎన్నో రకాల ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. పాలకూర పప్పు, పాలక్ పన్నీర్ ఇలా వివిధ రకాల వంటకాలు తయారు చేయవచ్చు. పాలకూరను ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఒక గ్లాస్ నీరు పోయాలి. ఆ నీరు కొంచెం హిట్ అయిన తర్వాత తరిగిన పాలకూరను వేసి పది నిమిషాలు వేడి చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ నీటిని కొంచెం చల్లారనివ్వాలి.

పాలకూర ఉడికించిన నీటిని ఫిల్టర్ చేసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజులపాటు ఉదయాన్నే తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మీ ఇమ్యునిటీ సిస్టమ్ ని మెరుగుపరుస్తాయి. ఈ మిశ్రమం వల్ల మీ శ్వాసకోస సమస్యలు ఉన్నా, ఆస్తమా ఉన్న ఉపశమనం కలిగించడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.