టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ తమన్నా (మిల్కీ బ్యూటీ) . లేటెస్టుగా ‘మ్యాస్రో’, ‘సీటీమార్’ సినిమాలతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. వెండితెరపై గ్లామర్ పంచడమే కాదు.. బుల్లితెర పైనా ఈ మధ్య తన గ్లామర్ తళుకులతో మిల మిలలాడుతోంది.
ఓ ఛానెల్‌లో ప్రసారమవుతున్న మాస్టర్ చెఫ్ అను ఓ వంటల ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ, ఆ ప్రోగ్రామ్‌కి తన అందచందాలతో మరింత వన్నె తెస్తోంది. అలా ఓ వైపు పెద్ద తెరనూ, మరో వైపు చిన్న తెరనూ కూడా మ్యానేజ్ చేస్తూనే, ఓటీటీ తెరపైనా తన సత్తా చాటుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా.
ఇవన్నీ ఓ ఎత్తైతే, తమన్నాలో ఎవ్వరికీ తెలియని ఓ సీక్రెట్ టాలెంట్ కూడా ఉందట. తమన్నా తండ్రి డైమండ్స్ వ్యాపారి. తెరపై అందాలొలకపోయడమే కాదు, తండ్రి వ్యాపారంలోనూ తమన్నా కొన్ని మెలకువలు నేర్చుకుందట. ఆ బిజినెస్‌లో తానే క్రియేటివ్ హెడ్‌గా వ్యవహరిస్తూ, ఆ బ్రాండ్స్‌కి సంబంధించిన డిజైన్స్‌ని తనే స్వయంగా ఓకే చేస్తుందట. అంటే జ్యూయలరీ డిజైన్స్ పట్ల కూడా తమన్నాకి మంచి ఐడియా, విజన్ ఉన్నట్లేగా.