భోళా శంకర్.. చిరుకి తప్ప అందరికి నామమే..

కమర్షియల్ రెగ్యులర్ రొటీన్ ఫార్మాట్లో వచ్చిన వేదళం సినిమాను చూసిన ఎవరైనా సరే అసలు రీమేక్ చేయాలని పెద్దగా ఆలోచించరు. అలాంటిది అనిల్ సుంకర ఏ విధంగా ఆలోచించాడో కానీ ఆ ఆణిముత్యం రీమేక్ హక్కులను తీసుకుని ఏకంగా శక్తి షాడో లాంటి డిజాస్టర్స్ ఇచ్చిన మెహర్ రమేష్ చేతిలో పెట్టడం మరొక పెద్ద షాకింగ్ ట్విస్ట్.

ఇక దీన్ని మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ మీద సోదర భావంతో ఒప్పుకొని ఉండొచ్చు. కానీ మిగతా వాళ్ళు ఎలా ఓకే చేశారు అనేది మరొక పెద్ద మిస్టరీ. డైరెక్టర్ ఈ సినిమాకు మరో పెద్ద మైనస్ అయితే తమన్నా భాటియా కూడా అంతే పెద్ద మైనెస్ గా నిలిచింది. సినిమాలో ఆమె సీన్స్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుంటే బెటర్ అనేలా కామెంట్స్ కూడా వస్తున్నాయి.

ఇక సినిమాలో మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు లిమిట్స్ దాటి టైమింగ్ తో కాస్త చిరాకుల తెప్పించారని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈ సినిమా మెగాస్టార్ పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు కానీ అసలే ఏజెంట్ డిజాస్టర్ లో ఉన్న నిర్మాత అనిల్ సుంకర కు చాలా గట్టి దెబ్బె కొట్టే అవకాశం ఉంది. ఇక సక్సెస్ లేని తమన్నా కూడా మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకోబోతోంది.

డైరెక్టర్ మెహర్ రమేష్ భవిష్యత్తు ఏమిటనేది మరో పెద్ద మిస్టరీ. ఇక అక్కినేని ఓ హీరో సుశాంత్ పాపం రెమ్యునరేషన్ గురించి ఆలోచించి చేశాడు ఏమో తెలియదు గానీ అతన్ని ఈ సినిమాల్లో గుర్తించదగిన పాత్రలో అయితే చూపించలేదు. ఇక కీర్తి సురేష్ కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకుని భారీగానే లాభం పొందింది. ఆమె కెరీర్ అయితే బాగానే ఉంది. అందుకే ఈ సినిమా డిజాస్టర్ ఎఫెక్ట్ పడుకోవచ్చు. మొత్తంగా నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు మెహర్ రమేష్, హీరోయిన్ తమన్నా, నటుడు సుశాంత్ లపై ఈ సినిమా ప్రభావం గట్టిగానే చూపే అవకాశం అయితే ఉంది. మరి వాళ్ళ తదుపరి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి.